వరద వేళ క్షేత్రంలోనే వైస్ చైర్మన్ జూపల్లి రమేష్ బాబు..!
సూర్య,అశ్వారావుపేట అశ్వారావుపేట మండల వ్యాప్తంగా తుఫాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు జలమయమైన పంట పొలాలు, రహదారులను మున్సిపల్ వైస్ చైర్మన్ జూపల్లి రమేష్ బాబు క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలించారు.భారీ వర్షాల కారణంగా ప్రజలు, రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను నేరుగా అడిగి తెలుసుకున్నారు. పంట నష్టపోయిన రైతులకు ధైర్యం చెప్పారు.
*వార్డుల్లో పారిశుద్ధ్యంపై ఆరా..*
అనంతరం మున్సిపాలిటీ పరిధిలో వర్షపు నీటితో జలమయమైన పలు వార్డులను సందర్శించి పరిస్థితులను సమీక్షించారు. వర్షాల కారణంగా రోడ్లపై పేరుకుపోయిన వ్యర్థాలను వెంటనే తొలగించి, డ్రైనేజీలను శుభ్రం చేయాలని, రోడ్లపై ఎక్కడా చెత్తాచెదారం లేకుండా పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచాలని మున్సిపల్ అధికారులు, సిబ్బందికి సూచించారు.
ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పారిశుద్ధ్య పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టాలని ఆదేశించారు.
*తెగిన అంకమ్మ చెరువు కట్ట వద్ద..*
భారీ వర్షాల కారణంగా నిన్న తెగిపోయిన అంకమ్మ చెరువు కట్టను కూడా ఆయన పరిశీలించారు. ఈ ప్రాంతంలో ప్రయాణించే ప్రజలు, వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ట్రాఫిక్ అంతరాయం ఏర్పడకుండా తగిన చర్యలు తీసుకోవాలని పోలీస్ శాఖ అధికారులతో మాట్లాడి సూచించారు. ప్రజల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ ట్రాఫిక్ నియంత్రణ చేపట్టాలని కోరారు.
సూర్య రిపోర్టర్ మునీర్ అశ్వరావుపేట