పోలింగ్ కేంద్రాలు పరిశీలిస్తున్న తెలుగుదేశం నేతలు
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు: పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన టీడీపీ పట్టణ అధ్యక్షుడు జి. విజయ్ కుమార్, శ్రీకాళహస్తి నియోజకవర్గo పరిధి తొట్టంబేడు మండలంలో జరుగుతున్న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ కేంద్రాలను టీడీపీ పట్టణ అధ్యక్షుడు జి. విజయ్ కుమార్ పరిశీలించారు.
మండలంలోని బసవయ్యపాలెం, జ్ఞానమ్మ కండ్రిగ, శేషమనాయుడు కండ్రిగ, దిగువ కొడతనేరి, చిన్న కనపర్తి, పెద్ద కనపర్తి, పూడి గ్రామాల్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా పోలింగ్ జరుగుతున్న తీరును, ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించి, అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో పట్టణ క్లస్టర్ ఇంచార్జ్ కంట రమేష్, ఏఎంసీ చైర్మన్ చెంచయ్య నాయుడు, టౌన్ బ్యాంక్ డైరెక్టర్ ఆరుముగం, చంద్రశేఖర్, మురళి, రమక్క, సిద్దుల నాయుడు, హరి నాయుడు, బాలాజీ, సురేష్ నాయుడు, రమేష్, మురళి, దయాకర్ తదితర తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు.