పంట నష్టానికి ఎకరం కు 25 వేలు పరిహారం అందించాలి..సున్నం నాగమణి..
సూర్య దమ్మపేట,
మురసు తుపాను నేపథ్యంలో భారీ వర్షాల కారణంగా పంట నష్టం జరిగిన రైతులకు 25 వేలు పంట నష్ట పరిహారాన్ని అందించాలని బీ ఆర్ యస్ రాష్ట్ర నాయకురాలు, ములకలపల్లి మాజీ జడ్పీటీసీ సున్నం నాగమణి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ క్రమంలోనే తుఫాన్ వల్ల నష్టం జరిగిన పంటను అంచనా వేసి రైతులకు న్యాయం చేయాలని ఆమె అన్నారు ఈ దిశలోనే రహదారూలు తెగిపోయి , చెరువులు గండ్లు పడి, చెరువులు పొంగి చేతికొచ్చిన పంటలు బారీగా నష్టం జరిగింది.తక్షణం రాష్ట్ర ప్రభుత్వం నష్ట పోయిన పంట పోలాలను అధికారులు పరిశీలించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
సూర్య రిపోర్టర్ దస్తగిర్ దమ్మపేట