BREAKING
వరద వేళ క్షేత్రంలోనే వైస్ చైర్మన్ జూపల్లి రమేష్ బాబు..! బాలల హక్కుల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత.జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి. సౌజన్య పంట నష్టానికి ఎకరం కు 25 వేలు పరిహారం అందించాలి..సున్నం నాగమణి.. పోలింగ్ కేంద్రాలు పరిశీలిస్తున్న తెలుగుదేశం నేతలు తెలంగాణ మత్స్య రంగ అభివృద్ధికి చర్యలు చేపట్టాలిః కేంద్రమంత్రికి మంత్రి వాకిటి శ్రీహరి విజ్ఞప్తి జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ అధికార యంత్రాంగానికి ప్రశంసలు కుటుంబ సమేతంగా ఓటు హక్కు వినియోగించుకున్న తొండపు దశరథ జనార్దన్ 40 ఏళ్లుగా భీమవరంలో నివాసం.. అయినా ఓటు హక్కు లేదు! గతంలో ఓటు వేసిన వ్యక్తికి ప్రస్తుత ఓటరు జాబితాలో పేరు గల్లంతు యాపిల్ ఉద్యోగుల ఏఐ ఖర్చులపై కోత: రోజువారీ బడ్జెట్‌లో భారీ తగ్గింపు గుడి నిర్మాణాన్ని అడ్డుకోవడం సరికాదు! ఫీజు రీయింబర్స్ మెంట్ పథకానికి 60% గ్రాంట్ ఇవ్వాలిః కేంద్ర మంత్రికి ఎంపీ ఆర్‌.కృష్ణయ్య విజ్ఞప్తి ప్రభుత్వ ఉద్యోగుల సేవల్లో ఇక డిజిటల్ పారదర్శకత!అదనపు కలెక్టర్ నగేష్ ప్రభుత్వ లాంఛనాలతో డాక్టర్ బాబ్జి అంత్యక్రియలు. భూముల రీ-సర్వేలో అవినీతికి తావుండకూడదు!అదనపు కలెక్టర్ నగేష్ 'ఖేతీ బచావో అభియాన్'తో రైతులకు అవగాహన..

బాలల హక్కుల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత.జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి. సౌజన్య

Select Suryaa Now
బాలల హక్కుల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత.జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి. సౌజన్య

సంగారెడ్డి, : బాలల హక్కులను పరిరక్షించడం, వారికి న్యాయం అందించడం సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అని సంగారెడ్డి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి. సౌజన్య పేర్కొన్నారు. ప్రతి బాలుడు, బాలికకు విద్య, ఆరోగ్యం, భద్రత, సంరక్షణతో పాటు గౌరవప్రదమైన జీవితం పొందే హక్కు ఉందని స్పష్టం చేశారు.నవంబర్ 9న నిర్వహించనున్న జాతీయ న్యాయ సేవల దినోత్సవాన్ని పురస్కరించుకొని చేపట్టిన వారోత్సవ కార్యక్రమాల్లో భాగంగా సంగారెడ్డిలోని జువైనల్ జస్టిస్ బోర్డు (జేజేబీ) కార్యాలయంలో న్యాయ అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా బి. సౌజన్య మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరికీ న్యాయం అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో జాతీయ, రాష్ట్ర, జిల్లా న్యాయ సేవాధికార సంస్థలు వివిధ న్యాయ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయని తెలిపారు. ఆర్థికంగా వెనుకబడినవారు, మహిళలు, పిల్లలు, సమాజంలోని బలహీన వర్గాలకు ఉచిత న్యాయ సహాయం అందించడమే ఈ సంస్థల ప్రధాన లక్ష్యమని వివరించారు.

బాలల హక్కులకు భంగం కలిగితే కఠినంగా స్పందించాలి

బాలల హక్కులు, సంరక్షణ, రక్షణకు సంబంధించిన చట్టాలపై, ముఖ్యంగా బాలల న్యాయం (పిల్లల సంరక్షణ మరియు రక్షణ) చట్టం-2015లోని కీలక నిబంధనలపై అవగాహన కల్పించారు. చట్టంతో సంఘర్షణలో ఉన్న బాలలు, సంరక్షణ మరియు రక్షణ అవసరమైన బాలల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాల్సిన అవసరాన్ని వివరించారు.బాలలపై హింస, వేధింపులు, వివక్ష, బాల కార్మికత్వం, బాల్యవివాహాలు, ఇతర దోపిడీ చర్యలను అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. బాలలు చట్టపరమైన సమస్యల్లో చిక్కుకున్నప్పుడు వారిని నేరస్థులుగా చూడకుండా, వారి వయస్సు, పరిస్థితులు, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని కౌన్సెలింగ్, పునరావాసం, విద్య, సామాజిక పునరేకీకరణకు ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు.

బాలల ప్రయోజనాలే ప్రధాన ప్రాధాన్యత

జువైనల్ జస్టిస్ బోర్డు ద్వారా బాలలకు అందించే న్యాయ సేవలు, కేసుల విచారణలో పాటించాల్సిన విధానాలు, బాలల వ్యక్తిగత గోప్యతను కాపాడాల్సిన ఆవశ్యకతను వివరించారు. ప్రతి సందర్భంలోనూ బాలల ప్రయోజనాలకే అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు.బాలలపై జరిగే నేరాల గురించి సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని, హక్కులకు భంగం కలిగినప్పుడు చట్టపరమైన సహాయం పొందాలని సూచించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా అర్హులైన బాలలకు ఉచిత న్యాయ సహాయం, న్యాయవాదుల సేవలు, అవసరమైన మార్గదర్శకత్వం అందుబాటులో ఉన్నాయని తెలిపారు. న్యాయ సహాయం పొందేందుకు ఎలాంటి భయం, సంకోచం అవసరం లేదని, న్యాయం పొందడం ప్రతి ఒక్కరి హక్కు అని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ మేజిస్ట్రేట్ కమ్ అదనపు జూనియర్ సివిల్ జడ్జి కె. ధనలక్ష్మి, జువైనల్ జస్టిస్ బోర్డు సభ్యులు వాసుదేవ్ రెడ్డి, పబ్లిక్ ప్రాసిక్యూటర్, జేజేబీ న్యాయవాది నిజాముద్దీన్, జేజేబీ లీగల్ ఎయిడ్ క్లినిక్ న్యాయవాది జె. శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమం ద్వారా బాలల హక్కులు, సంక్షేమం, రక్షణ చట్టాలు, ఉచిత న్యాయ సహాయ సేవలపై అవగాహన కల్పించడంతో పాటు జాతీయ న్యాయ సేవల దినోత్సవ వారోత్సవాల లక్ష్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లారు.