*ఖో-ఖోలో నవాబుపేట జట్టు విజయం
*--జిల్లా స్థాయి పోటీల్లో ప్రథమ బహుమతి కైవసం.* న్యూస్:మహబూబ్‌నగర్ స్టేడియం మైదానంలో బుధవారం పాఠశాలల క్రీడా సమాఖ్య(ఎస్జీఎఫ్) ఆధ్వర్యంలో నిర్వహించిన అండర్-17బాలుర జిల్లా స్థాయి ఖోఖో పోటీల్లో నవాబుపేట మండల జట్టు సత్తా చాటింది.ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ పోటీలో చిన్నచింతకుంట మండల జట్టుపై విజయం సాధించి ప్రథమ బహుమతిని కైవసం చేసుకుంది.ఈ సందర్భంగా మండల విద్యాధికారి నాగ్య నాయక్ విజయం సాధించిన విద్యార్థులను అభినందించారు.ఆయన మాట్లాడుతూ..విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ ఆసక్తి కనబరచాలని,క్రమశిక్షణ,పట్టుదల,నిరంతర సాధనతో ఉన్నత విజయాలను సాధించాలని అన్నారు.క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు ఆత్మవిశ్వాసం,జట్టుగా పనిచేసే తత్వాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు.జిల్లా స్థాయిలో ప్రథమ స్థానం సాధించడం మండలానికి గర్వకారణమని,ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో రాష్ట్ర,జాతీయ స్థాయి పోటీల్లోనూ రాణించాలని విద్యార్థులకు ఆయన పిలుపునిచ్చారు.విజయం సాధించిన విద్యార్థులను ఉపాధ్యాయ బృందం,మండలానికి చెందిన పలువురు ప్రముఖులు అభినందించారు.