ఓటు హక్కు వినియోగించుకున్న ఎంపీపీ అభ్యర్థి నారాయణస్వామి
గరుగుబిల్లి, సూర్య : ఎంపీటీసీ,జడ్పిటిసి ఎన్నికల పోలింగ్ పర్వంలో ఒక కీలక ఘట్టం ఆవిష్కృతమైంది.మండల పరిషత్ పీఠాన్ని ఆశిస్తున్న (ఎంపీపీ) అభ్యర్థి మరడాన నారాయణస్వామి తన సొంత గ్రామంలోని ఉల్లిభద్ర పోలింగ్ కేంద్రంలో సాధారణ పౌరుడిలా క్యూ లైన్ లో నిలబడి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.ఉదయాన్నే తన కుటుంబసభ్యులతో కలసి వచ్చిన ఎంపీపీ అభ్యర్థి మరడాన నారాయణ స్వామి ఓటు హక్కు వినియోగించు కుని ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వా మ్యులయ్యారు.ఎన్నికల బరిలో ఉన్న ప్పటికీ సాధారణ ఓటర్ లా క్యూ లైన్ లో నిలబడి ఎలాంటి హంగు ఆర్భా టాలు లేకుండా సామాన్య పౌరుడిలా ఎంపీపీ అభ్యర్థి మరడాన నారాయణ స్వామి ఉదయం 7 గంటలకే పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారు.క్యూలైన్ లో నిలబడి తనవంతు వచ్చే వరకు వేచి చూశారు.అనంతరం పోలింగ్ అధికారు లకు తన ఓటర్ గుర్తింపు కార్డును చూపించి ఓటు హక్కును వినియోగిం చుకున్నారు.ఎంపీపీ అభ్యర్థి స్వయంగా క్యూ లైన్ లో నిలబడి తన ఓటు హక్కును వినియోగించుకోవడం పట్ల స్థానిక ఓటర్లు సంతోషం వ్యక్తం చేస్తు న్నారు.అనంతరం ఎంపీపీ అభ్యర్థి మరడాన నారాయణస్వామి మాట్లా డుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు అత్యంత శక్తివంతమైన ఆయుధమని స్థానిక సంస్థల బలోపేతానికి ప్రతి ఒక్కరు ఓటింగ్ ప్రక్రియలో భాగస్వా మ్యులు కావాలని కోరారు.గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి స్థానిక సంస్థల ఎన్నికలు ఎంతో కీలకమని పేర్కొన్నా రు.ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపు నిచ్చా రు.ప్రస్తుతం జరుగుతున్న ఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం విజయభేరీ మోగించడం ఖాయమని ఎంపీపీ అభ్యర్థి మరడాన నారాయణస్వామి తెలిపారు.