BREAKING
కురువ భాస్కర్ పరామర్శించిన జిల్లా అధ్యక్షులు అనంత, మేయర్ రమేష్ గౌడ్ టీడీపీకి రాజీనామా చేసి వైఎస్సార్‌సీపీలో చేరిన కృష్ణాపురం గ్రామ దంపతులు రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలకు హేమశ్రీ ఎంపిక వైసీపీకి 30వ వార్డు అభ్యర్థి దంపతుల రాజీనామా అనుమతులు లేకుండా టపాసులు విక్రయిస్తే కఠిన చర్యలు: ఎస్పీ పంకజ్ కుమార్ మీనా స్థానిక పోరులో అభ్యర్థుల భవితవ్యం తేలేది నేడే స్థానిక సమరానికి ఫలితాల వేళ! విద్యార్థులకు ఉపన్యాస పోటీలు ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్ కి సర్వసిద్ధం ఉద్యాన రైతులకు రూ.11.79 కోట్ల నష్టపరిహారం వెంటనే విడుదల చేయాలి * సీఎం చంద్రబాబుకు ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు వినతి కల్వకోల్‌లో బీఆర్ఎస్ నేతల అసంతృప్తి సెగలు* 17ఏళ్ల దేశసేవకు ఘన సత్కారం పరిషత్ ఎన్నికల కౌంటింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు.... * విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ * జడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలి... చీరాల మున్సిపల్ ఎన్నికల ఓట్లు లెక్కింపు ప్రక్రియను పరిశీలించిన జిల్లా కలెక్టర్

ఆ రెండు గ్రామాలలో ఎవరికి మెప్పు -మరేెవరికి ముప్పు

Select Suryaa Now
ఆ రెండు గ్రామాలలో ఎవరికి మెప్పు -మరేెవరికి ముప్పు

గుర్ల, సూర్య : గుర్ల మండలంలో స్థానిక సంస్థల ఎన్నికల పోరు ఆ గ్రామాలలాో   ఆసక్తికరంగా మారింది. ప్రధానంగా పెనుబర్తి,చింతలపేట గ్రామంలో ఎంపిటిసి బరిలో త్రిముఖ పోటీ కావడంతో ఆయా గ్రామాలలో బలాబలాలు తేల్చుకునేందుకు అభ్యర్థులు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు.ఆయా గ్రామాలలో వైయస్సార్ పార్టీ అభ్యర్థులు సింగిల్ గా నిలబడడంతో తామే గెలుస్తామన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు.ఇక్కడే ట్విస్ట్ మొదలైంది. మండలంలో 18 ఎంపీ స్థానాలక గాను పెనుబర్తి గ్రామంలో ప్రధాన పార్టీలతో కాకుండా ఇద్దరు ఇండిపెండెంట్ అభ్యర్థులు బరిలో ఉన్నారు.ప్రధాన పార్టీల అభ్యర్థులు తమ ప్రచారాన్ని ముమ్మరం చేస్తుండగా, స్వతంత్ర అభ్యర్థులు గెలుపు లక్ష్యంగా తమదైన శైలిలో ఎదు రోడ్డి నిలబడడానికి ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. వైయస్సార్ పార్టీ తరపున ఒక్కరే పోటీ చేయడంతో టిడిపి శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది.టీడీపీ రెబల్ అభ్యర్థి ఓట్లు చీల్నట్లయితే వైయస్సార్ పార్టీ అభ్యర్థి గెలవడం ఖాయమని రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.మరోపక్క రెబల్ అభ్యర్థి అటు టిడిపి నుంచి ఇటు వైసిపి నుంచి ఓట్లు చీలిస్తే  రెండు ప్రధాన పార్టీలు పోయి ఇండిపెండెంట్ అభ్యర్థి గెలుస్తాడు కదా అన్న అనుమానం ఉత్పన్నమవుతోంది. ఇదిలా ఉండగా టిడిపి అభ్యర్థికి వైసిపి ఓట్లు కలిసి వస్తే టిడిపి గెలిచే పరిస్థితి ఉందనీిరాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.అంతేకాకుండా నాలుగో స్వతంత్ర అభ్యర్థి ఇక్కడ ఉన్నప్పటికీ ఎటువంటి ప్రచార ఆర్భాటం చేయలేదు.చింతలపేట గ్రామానికి వస్తే  గ్రామంలో వైయస్సార్ పార్టీ టిడిపి ప్రధాన పార్టీలు బరిలో ఉన్నాయనుకుంటే కూటమి తరుపున బిజెపి అభ్యర్థికి బి ఫారంతో  అక్కడ బిజెపి అభ్యర్థికి కూటమి సహకారం లేకపోవడంతో అక్కడ ప్రజల్లో సమస్య నెలకొంది.మరోపక్క ఇండిపెండెంట్ అభ్యర్థి నిలబడడంతో టిడిపి శ్రేణులు బిజెపి అభ్యర్థికి కాకుండా ఇండిపెండెంట్ అభ్యర్థికే ప్రాధాన్యతనిస్తూ కూటమీి ఓట్లన్నీ ఇండిపెండెంట్ అభ్యర్థికే మద్దతిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదే జరిగితే బిజెపి అభ్యర్థి తనకు టిడిపి వర్గీయులు సపోర్ట్ చేయకపోవడం జీర్ణించుకోలేక తనకున్న ఓటు బ్యాంక్ ఎటువైపు అన్న అనుమానం ప్రధాన పార్టీల వర్గీయుల్లో చర్చనీయంగా మారింది.దీంతో ఎవరికి ముప్పు,ఎవరికి మెప్పు అన్న మండల ప్రధాన నేతల్లో సందేహం నెలకొంది.మొత్తంగా ఆ రెండు గ్రామాలలో ఓటర్లు ఎవరికి పట్టం కడతారన్నది ఫలితాలు రేపే తేలనుంది.