శ్రీకాళహస్తి నియోజకవర్గంలో పోలింగ్ కేంద్రం పరిశీలిస్తున్న కలెక్టర్
జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ సరళిని పరిశీలించిన జిల్లా కలెక్టర్.
శ్రీకాళహస్తి, నవంబర్ 05: తిరుపతి జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియలో భాగంగా శ్రీకాళహస్తి నియోజకవర్గం తొట్టంబేడు మండలం బసవయ్యపాలెం గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ సందర్శించి పోలింగ్ సరళిని పరిశీలించారు.
ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రంలో ఓటింగ్ ప్రక్రియ నిర్వహణ, ఓటర్లకు కల్పించిన సౌకర్యాలు, పోలింగ్ సిబ్బంది విధుల నిర్వహణ తదితర అంశాలను పరిశీలించారు. ఎన్నికల ప్రక్రియ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ప్రశాంతంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో జరిగేలా అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఈ కార్యక్రమం లో తొట్టంబేడు తహసీల్దార్ భారతి, ఎన్నికల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వీసీ వెంకటయ్య సూర్య దినపత్రిక ఇన్చార్జి శ్రీకాళహస్తి