ఇండియా పాకిస్తాన్ బోర్డర్ అనుకుంటున్నారా... కొటియా గ్రామాల గిరిజనులపై దౌర్జన్యం చేస్తే సహించం
సాలూరు, సూర్య : పరిషత్ ఎన్నికలకు కొటియా వివాదాస్పద గ్రామాల ప్రజలను ఓట్లు వెయ్యకుండా ఒడిస్సా నాయకులు, అధికారులు పోలీసు బలగాలతో పొలిమేరలో భారీ క్యాడ్లను ఏర్పాటు చేయడం చూస్తుంటే మనం ఇండియా పాకిస్తాన్ బోర్డర్ లో ఉన్నామా అన్నట్లు ఉందని మంత్రి సంధ్యారాణి ఒడిస్సా నాయకుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు కొటియాలో ఉన్న 21 గ్రామాలపై సుప్రీంకో స్టేటస్కో దశాబ్దాల క్రితమే విధించింది. అప్పటినుండి ఇరువు రాష్ట్రాల నాయకులు అధికారులు గమ్మునున్నారనే చెప్పుకోవాలి. అక్కడ నివసించే ప్రజలకు ఇటు ఆంధ్ర అటు ఒడిస్సా నుండి రెండేసి ఆధార్ కార్డులు రెండేసి రేషన్ కార్డులు రెండుసార్లు తో పాటు అన్ని రెండేసి చొప్పున ఇరు రాష్ట్రాల నుండి అనుభవిస్తూ వస్తున్నారు. గత ఐదు సంవత్సరాల నుండి ఒడిస్సా అధికారులు వివాదాస్పద కొటియా గ్రామాలను 110 కోట్లతో అభివృద్ధి చేశారు. అప్పటినుండి ఒడిస్సా అధికారులు దుందుడుకు చర్యలకు పాల్పడుతూ వస్తున్నారు. ఆయా గ్రామాలకు వెళ్లిన అధికారులను పలుమార్లు అడ్డగించి ఇవి మా గ్రామాలు మీరు ఎందుకు ఇందులోకి వస్తున్నారని ఆంధ్ర అధికారులను వెళ్లిపొమ్మని హెచ్చరించిన ఘటనలు చాలా ఉన్నాయి. లక్ష్మివారం జరుగుతున్న పరిషత్ ఎన్నికలకు కొటియా వివాదాస్పద గ్రామాల్లో ఉన్న ఓటర్లను వెళ్ళనివ్వకుండా ఒడిస్సా అఖిలపక్ష నాయకులంతా ఏకమై ఆయా గ్రామాల లో ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. దీంతో ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. ఆంధ్ర నుండి కొటియా గ్రామాల జిసిసి డిపోలకు లారీలతో వెళ్తున్న బియ్యాన్ని ఒడిస్సా నాయకులు అడ్డుకున్నారు దీంతో అక్కడ వాతావరణం ఒక్కసారి వేడెక్కింది. అక్కడ ప్రజలు అసహనానికి లోనై అధికారులపై ధ్వజమెత్తారు ఏర్పాటు చేసిన భారీ కార్డులను సైతం పెకలించి వేశారు మాకు నచ్చిన వాళ్లకు ఓటు వేసే హక్కు మాకు ఉందని మమ్మల్ని ఆపే హక్కు మీకు లేదని ఎదురు తిరిగారు. ఈ విషయాలను తెలుసుకున్న జిల్లా జాయింట్ కలెక్టర్ వైశాలి పోలీస్ బలగాలను తీసుకువెళ్లి అక్కడున్న అఖిలపక్ష నాయకులతో మంతనాలు జరిపారు. అవి ఫలించకపోవడంతో చేసేది లేక నేరెళ్ల వలసలు ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని సైతం సారిక గ్రామానికి మార్చవలసి వచ్చింది.
వివాదాస్పద కొరియా గ్రామాల ప్రజలకు ఆంధ్ర ప్రభుత్వం అండగా ఉంటుంది మంత్రి సంధ్యారాణి..
కొటీగా వివాదాస్పద గ్రామాల ప్రజలకు ఆంధ్ర ఎప్పుడు అండగానే ఉంటుందని మంత్రి సంధ్యారాణి అన్నారు. ఒడిస్సా నాయకులు నేరళ్ల వాళ్ళ గ్రామంలో పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తే అల్లర్లు జరుగుతాయి అన్న విషయంతో అక్కడున్ఊ పోలింగ్ కేంద్రాన్ని సారిక గ్రామంలో ఏర్పాటు చేశారు. మంత్రి సంధ్యారాణి పరిశీలించాడానికి వెళ్లినప్పుడు విలేకరులతో మాట్లాడినప్పుడు ఎక్కడున్నా వాతావరణం చూస్తుంటే కొద్దిగా వివాదాస్పద గ్రామాల్లో నెలకొన్న పరిస్థితి స్పష్టంగా కనబడుతుందని ఒరిస్సా అధికారుల తీరుపై మండిపడ్డారు. ఓటు వేసే వారికి ప్రభుత్వం రక్షణ కల్పిస్తుందని తిరిగి ఇంటికి వెళ్లే వరకు ఆంధ్ర ప్రభుత్వం తప్పక మిమ్మల్ని రక్షిస్తుందని చెప్పుకొచ్చారు అయితే అఖిలపక్ష నాయకులంతా ఏకమై బెదిరించినప్పటికీ ఓట్లు వేయడానికి గిరిజనులు వివిధ మార్గాల ద్వారా దిగుప్రాంతంలో ఉన్న సారిక గ్రామంలో ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రం వద్ద తమ ఓట్లను వినియోగించుకున్నారు.