టెన్షన్ టెన్షన్ అల్లూరి ఓటింగ్ పై ముఖ్యమంత్రి ఆరా * జనసేన గెలుపుపై పవన్ కళ్యాణ్ ధీమా *
రాష్ట్రవ్యాప్తంగా కూటమి ప్రభుత్వం సునామి సృష్టించింది కూటమి శ్రేణుల్లో ఆనంద ఉత్సవాలు వ్యక్తం అవుతుంది ఉత్తరాంధ్ర జిల్లాల్లో రూరల్ జిల్లాలో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల ఓటింగ్ సరళి ఉధృతంగా జరుగుతుంది . ఈ నేపథ్యంలో అల్లూరి జిల్లా అనకాపల్లి జిల్లా విజయనగరం జిల్లా మన్యం జిల్లాల్లో జడ్పీ చైర్మన్ పదవి కైవసం చేసుకునేందుకు కూటమి ప్రభుత్వం కుతూహలంగా ఉంది విజయనగరం జిల్లాలలో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభావం గట్టిగ ఉంది మన్యం జిల్లాల్లో కూడా అనకాపల్లి జిల్లాలో ప్రస్తుతం జరుగుతున్న తీరు వేరే చెప్పనక్కర్లేదు మైదాన ప్రాంతంలో జరిగిన ప్రభావం తో వైఎస్ఆర్సిపి కుదేలవడంతో ఆ పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నారు విశాఖపట్నం లాంటి మహానగరం కార్పొరేషన్ లో గెలుపుకు కారణం విశాఖపట్నం అభివృద్ధి ఖాయంగానే ఓటర్లు తమ ఓటును వినియోగించుకున్నారు అలాగే అల్లూరి జిల్లాలోనూ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాగబాబు బిజెపి అధ్యక్షులు మాధవ్ లాంటి అగ్ర నాయకులు అల్లూరి జిల్లా పై ప్రత్యేకమైన ఫోకస్ కి గురి చేశారు ఈ నేపథ్యంలో కూటమి గెలుపు కోసం తహతహలాడుతుంది జడ్పీ చైర్మన్ పదవి చేజెక్కించుకోవాలని చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లు తమ అగ్ర నాయకులను గెలుపు పై గెలుపు సంఖ్యపై జెడ్పిటిసి ఆయా మండలాల గెలుపుకై ఓటింగ్ సరళి మెజారిటీ ఏ మేరకు వస్తుందోనని ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా తెలుసుకున్నట్లు సమాచారం కార్యకర్తలు పటిష్టంగా ఉన్నప్పటికీ ఎవరెవరు ఎక్కడ సహకారం అందించలేదు ఆ చిట్టంతా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ల వద్ద పెట్టుకున్నట్లు విశ్వసేనే సమాచారం ఇప్పుడు జరుగుతుందంతా ఓటింగ్ అనంతరం కూటమి తరపున జడ్పీ చైర్మన్ పదవి పైనే ఈ విధంగా కూటమి ఆలోచనలు ఉంటే వైఎస్ఆర్సిపి పార్టీ ఆలోచన మరోలా ఉంది వైఎస్ఆర్సిపి పార్టీ పార్టీ ఆవిర్భావం నుండి పటిష్టం కార్యకర్తలు ఉన్నారని తమ గెలుపు ఖాయం గా ఉన్నట్లు ఇక్కడ నాయకులుగా ఉన్న జిల్లా అధ్యక్షులు వైయస్సార్ పార్టీ మత్స్యరాస విశ్వేశ్వర రాజు అరకు పార్లమెంట్ సభ్యురాలు గుమ్మ తనుజరాని గవర్నర్ కోట ఎమ్మెల్సీ కుంభ రవిబాబు అరకు లోయ మాజీ శాసనసభ్యులు శెట్టి పాల్గొన స్థానిక శాసనసభ్యులు రేగమ్ మత్స్య లింగం పాడేరు మాజీ శాసన సభ్యురాలు కే భాగ్యలక్ష్మి లు వైయస్సార్ పార్టీ గెలుస్తుందని తెగ మదన పడిపోతున్నారు ఇప్పటికే వైసీపీ పార్టీ గెలుపు లెక్కలు వేసుకొని ఎట్టి పరిస్థితుల్లోనూ తాము 60 శాతం జడ్పిటిసి స్థానాలు కైవసం చేసుకుంటామని జెడ్పి పదవి ఎట్టి పరిస్థితుల్లో చేజార్చుకోమని కుండల బద్దలు కొట్టి చెప్తున్నారు . మరి రెండు రోజుల్లో కౌంటింగ్ ఉండడంతో కూటమి ప్రభంజములో కొట్టుకొని పోతారా లేక నిలబడి తమ సత్తా చాటుతారో లేక రాష్ట్ర ప్రభంజనంలో అల్లూరి జిల్లాలో కూడా వైసీపీ పార్టీ ఏం జరుగుతుందని ఆందోళన చెందుతున్నారు.