పడిపోయిన వరి పంట పై ఉప్పు ద్రావణం పిచికారీ చేయాలి. AO
పడిపోయిన వరి పంట పై ఉప్పు ద్రావణం పిచికారీ చేయాలని మండల వ్యవసాయాధికారి కొర్రపాటి వెంకటకృష్ణ సూచించారు. మురసు తుఫాన్ కారణంగా ధర్మవరం,శంఖవరప్పాడు, కలవకూరు గ్రామాలలో దెబ్బతిన్న వరి పంటను పరిశీలించారు. తీవ్రమైన గాలి కారణంగా పంటకు వచ్చిన వరి పంట పూర్తి గా నేల కొరిగిందని, మరో 20 రోజులలో కోతకు వచ్చే దశలో తుఫాన్ కారణంగా పంట దెబ్బతిన్నదని రైతులు వాపోయారు. అక్కడక్కడ కంకులు మొలకెత్తుతున్నాయని గమనించిన అధికారులు 100 లీటర్ల నీటికి 5 కేజీ ల ఉప్పు ద్రావణాన్ని కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే మొలక రాకుండా ఉంటుందని తెలిపారు, పొలంలో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని సూచించారు..