BREAKING
వరికొనుగోలు కేంద్రాల ప్రారంభం వైస్ చైర్మన్ జూలకంటి సురేష్ ను కలిసి ఆహ్వాన పత్రం అందజేసిన మాజీ మున్సిపల్ చైర్మన్ సుబ్బారావు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) పెట్టుబడుల జోరు దాదాపూర్‌లో నాసిరకం రేషన్‌ బియ్యం.. పురుగులు, తుట్టెలతో లబ్ధిదారుల ఆగ్రహం హోరాహోరీ... గెలుపు ఎవరిది..! రూ. 1.8 లక్షల కోట్లతో రోకు (Roku) సంస్థను సొంతం చేసుకున్న ఫాక్స్ కార్పొరేషన్ బాలికలకు హెచ్ పీవీ టీకా.. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి 75త్యాళ్ళూరు పిఎం శ్రీ హైస్కూల్లో బ్రిక్స్ సుస్థిర జీవనశైలి వారోత్సవాలు ప్రభుత్వ జూనియర్ కళాశాలకు రిఫ్రిజిరేటర్ వితరణ. హౌస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ పదవిని ఆశిస్తున్న మాక్సిన్ వాటర్స్ కార్పొరేటర్ల ఆత్మీయ సమావేశంలో రాజ్యసభ సభ్యులు భాష్యం రామకృష్ణకు సత్కారం యువతకు నైపుణ్య శిక్షణ అందించాలి.. పరిశ్రమలతో కలిసి ప్రత్యేక నిధి ఏర్పాటు చేయాలి: ఎంపీ ఈటల రాజేందర్ ప్రజల ఆరోగ్యంతో ఆటలాడితే చర్యలు తప్పవు ప్రపంచ వాతావరణ పోరులో చైనా క్లీన్ టెక్నాలజీ విప్లవం

ఓట్ల లెక్కింపుకు ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు

Select Suryaa Now
ఓట్ల లెక్కింపుకు ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు

గూడూరు, మేజర్‌న్యూస్‌  :   జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సంబంధించి లెక్కింపుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. శుక్రవారం ఉదయం ఓటింగ్‌ పరిశీలకులు డిపిఓ వెంకటరామన్‌ అధికారలతో కలసి లెక్కింపు కేంద్రాన్ని పరిశీలించారు. కౌంటింగ్ కేంద్రంలో ఓట్ల లెక్కింపు సజావుగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. నియోజకవర్గంలో మొత్తం 5 జెడ్పీటీసీ స్థానాలు ఉండగా ఒకటి స్థానం ఏకగ్రీవం కాగ మిగిలిన 4 స్థానాలకు అభ్యర్థులు పోటీలో ఉన్నారని తెలిపారు. అదే విధంగా ఎంపీటీసీ స్థానాలకు గూడూరులోని ఎస్‌వీ ఆర్ట్స్ అండ్ డిగ్రీ కళాశాలలో రాపూరు, సైదాపురం, గూడూరు, చిల్లకూరు, కోట మండలాల ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్లు తెలిపారు. వాకాడు, చిట్టమూరు మండలాలకు నాయుడుపేటలో కౌంటింగ్ ప్రక్రియ నిర్వహిస్తునట్లు తెలిపారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఎన్నికల కౌంటింగ్ విధుల కోసం మొత్తం నలుగురు సిఐలు, 8 మంది ఎస్‌ఐలు, 112 మంది పోలీసు సిబ్బందిని నియమించామని పేర్కొన్నారు. డీఎస్పీ నరసింహమూర్తి ఆద్వర్యంలో ప్రత్యేక చర్యలు చేపట్టారు. కౌంటింగ్ ప్రక్రియను పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో, ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పరిశీలనలో ఆర్‌ఓలు ఐదు మంది ఇతర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.