దేవాలయాల నిర్మాణానికి రూ.11 వేల విరాళం
ఊరేళ్ల వార్డు ప్రజల తరఫున కాలేముల విజయ్‌కు కృతజ్ఞతలు
చేవెళ్ల: చేవెళ్ల మున్సిపాలిటీ పరిధిలోని ఊరేళ్ల వార్డులో నూతనంగా నిర్మిస్తున్న ఊరడమ్మ, మైసమ్మ దేవాలయాల నిర్మాణానికి కేసరం గ్రామానికి చెందిన కాలేముల విజయ్ రూ.11 వేల విరాళం అందజేశారు. దేవాలయాల నిర్మాణానికి తన వంతు సహకారంగా ఈ మొత్తాన్ని అందించి ఉదారత చాటుకున్నారు. ఈ సందర్భంగా కాలేముల విజయ్‌కు ఊరేళ్ల వార్డు ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. దేవాలయాల నిర్మాణానికి దాతలు ముందుకు రావడం అభినందనీయమని స్థానికులు పేర్కొన్నారు.