BREAKING
తాగునీటిని వృథా చేస్తే కఠిన చర్యలు జలమండలి అధికారుల పిలుపు వెలిమెలలో తాగునీటి సమస్యకు పరిష్కారం నేషనల్ ఫుట్బాల్ గేమ్ సెలెక్ట్ అయిన గిరిజన విద్యార్థిని శైలజ ప్రజా సమస్యలపై ఎమ్మెల్సీ అంజిరెడ్డి క్షేత్రస్థాయి పర్యటన విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన. అర్హులైన ఓటర్లకు ఎన్నికల సంఘం మరో అవకాశం.! కోహెడ నూతన డ్యూప్యూటీ తహసీల్దార్ రాకేష్ 25 రోజులుగా హిందీ క్లాసులు జరగలేదు…సర్పంచ్ కి విద్యార్థులు వినతి పత్రం… కెసిఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలంటూ యువకుల పాదయాత్ర.… మహమ్మద్ షమీ ఎఫెక్ట్: మ్యాచ్ విన్నింగ్ స్పెల్స్.. ఓటముల్లోనూ హీరోగా.. లెక్కలకు అందని విదేశీ లెగసీ! కూరెళ్ల అంగన్వాడీ హెల్పర్(ఆయా) కమలమ్మ కుటుంబానికి పది లక్ష ఎక్స్ గ్రేషియాను ఇవ్వాలి ఎమ్మెల్యే అమర్ ను కలసిన చిత్తూరు మేయర్ కటారి హేమలత ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు కోహెడ ఎస్సై అభిలాష్ న్యాయవాది మంద నగేష్ కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పరామర్శ.. లక్ష్మమ్మ పార్థివదేహానికి ఘన నివాళి న్యూజిలాండ్ టెస్ట్ టూర్ కి మహమ్మద్ షమీని ఎంపిక చేయాల్సి ఉండింది: మాజీ కోచ్ రవిశాస్త్రి సంచలన వ్యాఖ్యలు

దీపావళిని సురక్షితంగా జరుపుకోవాలి.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: 108 సేవల సీఈఓ బి. సుధాకర్

Select Suryaa Now
దీపావళిని సురక్షితంగా జరుపుకోవాలి.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: 108 సేవల సీఈఓ బి. సుధాకర్
కీసర, మేజర్ న్యూస్: దీపావళి పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకునే సమయంలో ప్రజలు తగిన జాగ్రత్తలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని EMRI గ్రీన్ హెల్త్ సర్వీసెస్ (GHS) 108 అత్యవసర సేవల సీఈఓ బి. సుధాకర్ సూచించారు. బాణసంచా కాల్చే సమయంలో చిన్నపాటి నిర్లక్ష్యం కూడా అగ్నిప్రమాదాలకు, కాలిన గాయాలకు దారితీస్తుందని హెచ్చరించారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధుల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు.
దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ పలు భద్రతా సూచనలు చేశారు. బాణసంచాను ఇళ్లు, వాహనాలకు దూరంగా విశాలమైన బహిరంగ ప్రదేశాల్లో మాత్రమే కాల్చాలని, కాటన్ దుస్తులు, పాదరక్షలు ధరించాలని సూచించారు. చిన్నపిల్లలు పెద్దల పర్యవేక్షణలోనే టపాసులు కాల్చాలని, చేతిలో పట్టుకుని బాణసంచా పేల్చకూడదని, పేలని టపాసులను తిరిగి వెలిగించే ప్రయత్నం చేయకూడదని హెచ్చరించారు. ముందస్తు జాగ్రత్తగా నీరు లేదా ఇసుకను అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు.బాణసంచా వల్ల కాలిన గాయాలు ఏర్పడితే ఐస్ ఉపయోగించకుండా సాధారణ చల్లటి ప్రవహించే నీటితో కనీసం 20 నిమిషాల పాటు గాయమైన ప్రాంతాన్ని చల్లబరచాలని సూచించారు. గాయాలపై టూత్‌పేస్ట్, నూనె, ఇంకు వంటి పదార్థాలు పూయకూడదని, బొబ్బలను పగలగొట్టకుండా వెంటనే వైద్య చికిత్స పొందాలని పేర్కొన్నారు.గతంలో వెల్లడించిన గణాంకాల ప్రకారం 2025లో సాధారణ రోజుల్లో అగ్నిప్రమాదాల కారణంగా 1,766 మంది గాయపడగా, ఒక్క దీపావళి రోజునే బాణసంచా ప్రమాదాల్లో 1,699 మంది గాయపడినట్లు తెలిపారు. ఈ గణాంకాలు పండుగ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల ఆవశ్యకతను తెలియజేస్తున్నాయని అన్నారు.తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ప్రతి మండలంలో 108 అంబులెన్స్ సేవలు అందుబాటులో ఉన్నాయని, అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు 24 గంటల పాటు సేవలందించేందుకు సిబ్బంది సిద్ధంగా ఉన్నారని బి. సుధాకర్ వెల్లడించారు. అగ్నిప్రమాదాలు, కాలిన గాయాలు లేదా ఇతర అత్యవసర వైద్య పరిస్థితులు ఎదురైతే వెంటనే 108కు కాల్ చేయాలని విజ్ఞప్తి చేశారు.చిన్నపాటి జాగ్రత్తలు పెద్ద ప్రమాదాలను నివారిస్తాయని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరిస్తూ కుటుంబ సభ్యుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన కోరారు. ప్రజలందరూ ఆనందంగా, ఆరోగ్యంగా, సురక్షితంగా దీపావళి పండుగను జరుపుకోవాలని 108 అత్యవసర సేవల తరఫున బి. సుధాకర్ ఆకాంక్షించారు.