దీపావళి బాణాసంచా తయారీ, నిల్వ, అమ్మకాలకు అనుమతి తప్పనిసరి!
లక్కవరపుకోట, సూర్య : దీపావళి పండుగ సందర్భంగా బాణాసంచా తయారీ, నిల్వ, విక్రయాలు నిర్వహించే వారు తప్పనిసరిగా సంబంధిత అధికారుల నుంచి ముందస్తు అనుమతులు పొందాలని సీఐ హిమగిరి సూచించారు. ఎటువంటి అనుమతులు లేకుండా బాణాసంచా తయారు చేసినా, నిల్వ ఉంచినా, విక్రయాలు జరిపినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, ప్రమాదాలకు తావులేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.