BREAKING
వరికొనుగోలు కేంద్రాల ప్రారంభం వైస్ చైర్మన్ జూలకంటి సురేష్ ను కలిసి ఆహ్వాన పత్రం అందజేసిన మాజీ మున్సిపల్ చైర్మన్ సుబ్బారావు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) పెట్టుబడుల జోరు దాదాపూర్‌లో నాసిరకం రేషన్‌ బియ్యం.. పురుగులు, తుట్టెలతో లబ్ధిదారుల ఆగ్రహం హోరాహోరీ... గెలుపు ఎవరిది..! రూ. 1.8 లక్షల కోట్లతో రోకు (Roku) సంస్థను సొంతం చేసుకున్న ఫాక్స్ కార్పొరేషన్ బాలికలకు హెచ్ పీవీ టీకా.. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి 75త్యాళ్ళూరు పిఎం శ్రీ హైస్కూల్లో బ్రిక్స్ సుస్థిర జీవనశైలి వారోత్సవాలు ప్రభుత్వ జూనియర్ కళాశాలకు రిఫ్రిజిరేటర్ వితరణ. హౌస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ పదవిని ఆశిస్తున్న మాక్సిన్ వాటర్స్ కార్పొరేటర్ల ఆత్మీయ సమావేశంలో రాజ్యసభ సభ్యులు భాష్యం రామకృష్ణకు సత్కారం యువతకు నైపుణ్య శిక్షణ అందించాలి.. పరిశ్రమలతో కలిసి ప్రత్యేక నిధి ఏర్పాటు చేయాలి: ఎంపీ ఈటల రాజేందర్ ప్రజల ఆరోగ్యంతో ఆటలాడితే చర్యలు తప్పవు ప్రపంచ వాతావరణ పోరులో చైనా క్లీన్ టెక్నాలజీ విప్లవం

వివాదాస్పద స్థలంలో టపాసుల దుకాణం.. పెట్రోల్ బంకు సమీపంలో ఏర్పాటు చేయడంపై ఆందోళన

Select Suryaa Now
వివాదాస్పద స్థలంలో టపాసుల దుకాణం.. పెట్రోల్ బంకు సమీపంలో ఏర్పాటు చేయడంపై ఆందోళన
కీసర, మేజర్ న్యూస్: స్థలంపై కోర్టులో వివాదం కొనసాగుతుండగానే తమ అభ్యంతరాలను బేఖాతరు చేస్తూ రాంపల్లిలో టపాసుల దుకాణం ఏర్పాటు చేశారని స్థల యజమానులు ఆరోపించారు. మహంకాళి అమ్మవారి ఆలయం వెనుక, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ పెట్రోల్ బంకు సమీపంలో బాణసంచా విక్రయ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం ప్రజల భద్రతకు ఆందోళన కలిగిస్తోందని పేర్కొన్నారు. ఈ దుకాణం ఏర్పాటును నిలిపివేసి, అనుమతులు, భద్రతా ప్రమాణాలపై అధికారులు సమగ్రంగా విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు బొమ్మిడి బుచ్చిరెడ్డి, నరేందర్‌రెడ్డి కుటుంబ సభ్యులు శుక్రవారం కీసరలో మీడియా సమావేశం నిర్వహించి తమ ఆవేదనను వ్యక్తం చేశారు.రాంపల్లిలోని సర్వే నంబర్లు 198/1, 199లో ఉన్న ఉమ్మడి స్థలానికి సంబంధించి రెండో అదనపు జిల్లా కోర్టులో ఓఎస్ నంబర్ 1346/2016తో ఆస్తి వివాదం కొనసాగుతోందని వారు తెలిపారు. పి. వెంకట్‌రెడ్డి కుటుంబ సభ్యులకు, బొమ్మిడి బుచ్చిరెడ్డి, నరేందర్‌రెడ్డి కుటుంబ సభ్యులకు మధ్య ఆస్తి విభజనకు సంబంధించిన దావా విచారణలో ఉందని వివరించారు. ఈ పరిస్థితుల్లో తమ అభ్యంతరాలను పట్టించుకోకుండా పి. వెంకట్‌రెడ్డి 'అయ్యప్ప క్రాకర్స్' పేరుతో టపాసుల దుకాణం ఏర్పాటు చేసేందుకు గుండె శ్రీనివాసులు అనే వ్యక్తికి స్థలాన్ని అద్దెకు ఇచ్చారని ఆరోపించారు.ఈ వ్యవహారంపై ఘట్‌కేసర్ మున్సిపల్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ వాణిరెడ్డి, కీసర పోలీస్‌స్టేషన్ ఇన్‌స్పెక్టర్ ఎలక్షన్‌రెడ్డి, చెర్లపల్లి అగ్నిమాపక కేంద్రం అధికారులకు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. డిప్యూటీ కమిషనర్ స్థానిక పోలీసులు పరిశీలిస్తారని చెప్పగా, అగ్నిమాపక శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీ చేసి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. పోలీస్ ఇన్‌స్పెక్టర్ తమ సమక్షంలోనే అభ్యంతరాలు ఉన్నందున దుకాణాన్ని తొలగించాలని నిర్వాహకులకు సూచించినప్పటికీ, వారు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అనుమతులు పొందామని, ఎవరూ ఏమీ చేయలేరంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని మీడియా సమావేశంలో పేర్కొన్నారు.ముఖ్యంగా పెట్రోల్ బంకు సమీపంలో బాణసంచా దుకాణం ఏర్పాటు చేయడంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని స్థల యజమానులు కోరారు. దుకాణానికి అవసరమైన అన్ని అనుమతులు ఉన్నాయా? అగ్నిమాపక భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నారా? అనే అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. కోర్టులో కొనసాగుతున్న స్థల వివాదంతో పాటు ప్రజల ప్రాణ భద్రతను దృష్టిలో ఉంచుకుని దుకాణం ఏర్పాటుపై తక్షణమే చర్యలు తీసుకోవాలని, నిబంధనల ఉల్లంఘనలు ఉన్నట్లు తేలితే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బొమ్మిడి బుచ్చిరెడ్డి, నరేందర్‌రెడ్డి కుటుంబ సభ్యులు అధికారులను డిమాండ్ చేశారు.