BREAKING
వరికొనుగోలు కేంద్రాల ప్రారంభం వైస్ చైర్మన్ జూలకంటి సురేష్ ను కలిసి ఆహ్వాన పత్రం అందజేసిన మాజీ మున్సిపల్ చైర్మన్ సుబ్బారావు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) పెట్టుబడుల జోరు దాదాపూర్‌లో నాసిరకం రేషన్‌ బియ్యం.. పురుగులు, తుట్టెలతో లబ్ధిదారుల ఆగ్రహం హోరాహోరీ... గెలుపు ఎవరిది..! రూ. 1.8 లక్షల కోట్లతో రోకు (Roku) సంస్థను సొంతం చేసుకున్న ఫాక్స్ కార్పొరేషన్ బాలికలకు హెచ్ పీవీ టీకా.. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి 75త్యాళ్ళూరు పిఎం శ్రీ హైస్కూల్లో బ్రిక్స్ సుస్థిర జీవనశైలి వారోత్సవాలు ప్రభుత్వ జూనియర్ కళాశాలకు రిఫ్రిజిరేటర్ వితరణ. హౌస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ పదవిని ఆశిస్తున్న మాక్సిన్ వాటర్స్ కార్పొరేటర్ల ఆత్మీయ సమావేశంలో రాజ్యసభ సభ్యులు భాష్యం రామకృష్ణకు సత్కారం యువతకు నైపుణ్య శిక్షణ అందించాలి.. పరిశ్రమలతో కలిసి ప్రత్యేక నిధి ఏర్పాటు చేయాలి: ఎంపీ ఈటల రాజేందర్ ప్రజల ఆరోగ్యంతో ఆటలాడితే చర్యలు తప్పవు ప్రపంచ వాతావరణ పోరులో చైనా క్లీన్ టెక్నాలజీ విప్లవం

శనిత్రయోదశి సందర్భంగా ఎన్కతల శనేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు

Select Suryaa Now
శనిత్రయోదశి సందర్భంగా ఎన్కతల శనేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు
మోమిన్‌పేట, మేజర్ న్యూస్: శనిత్రయోదశి పర్వదినాన్ని పురస్కరించుకుని మోమిన్‌పేట మండల పరిధిలోని ఎన్కతల గ్రామంలో వెలసిన శ్రీ శనేశ్వర స్వామి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించేందుకు ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ విషయాన్ని ఆలయ ఈవో నరేందర్ తెలిపారు. శనిత్రయోదశి సందర్భంగా స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరానున్న నేపథ్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు.శనిత్రయోదశి రోజున శనిదేవుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తే శని దోషాల నుంచి ఉపశమనం కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. దీంతో ఎన్కతలతో పాటు పరిసర గ్రామాల నుంచే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ఆలయానికి చేరుకుని స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకోనున్నారు.భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దర్శనం, పూజల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఈవో నరేందర్ తెలిపారు. భక్తులు క్రమశిక్షణతో పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు.