ఓట్లు లెక్కింపు సిబ్బందికి శిక్షణా కార్యక్రమం
గరుగుబిల్లి, సూర్య : జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను నిర్ణీత సమ యంలో పూర్తి చేయడం అత్యంత కీలకమని మాస్టర్ ట్రైనర్ బొత్స రవికుమార్ పేర్కొన్నారు.మండల పరిధిలోని ఉల్లిభద్ర గ్రామ సమీపంలోని హార్టికల్చర్ కళాశాలలో ఎంపీటీసీ జడ్పిటిసి ఓట్లు లెక్కింపునకు సంబంధించి నియమించిన సిబ్బందికి శుక్రవారం శిక్షణా కార్యక్రమంను నిర్వ హించారు.ఈసందర్భంగా మాస్టర్ ట్రైనర్ బొత్స రవికుమార్ మాట్లాడు తూ ఓట్ల లెక్కింపు ప్రక్రియను నిర్ణీత సమయంలో పూర్తి చేయడంతో పాటు విజయవంతం చేయాలని పేర్కొన్నారు. ప్రతి అనుభవాన్ని ఒక పాఠంగా తీసు కుని, కౌంటింగ్ ప్రక్రియను పకడ్బందీగా, వేగవంతంగా నిర్వహించాలని సూచిం చారు.ఓట్ల లెక్కింపులో ఎలాంటి పొర పాట్లకు తావులేకుండా కచ్చితత్వంతో విధులు నిర్వహించాలని, ప్రక్రియ సజావుగా, వేగంగా పూర్తయ్యేలా ఓట్లు లెక్కింపు సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని తెలిపారు.ఎన్నికల కమిషన్ నిబంధనలను కచ్చితంగా పాటిస్తూ ప్రశాంతమైన, పారదర్శకమైన వాతావరణంలో కౌంటింగ్ పూర్తయ్యేలా చూడాలని తగు సూచనలు,సలహా లను అందజేశారు.ఈకార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీవో మరడాన వెంకటే శ్వరరావు,మాస్టర్ ట్రైనర్ లు కొట్నాన మురళీమోహన్,ఏగేటి శంకర్రావు తది తరులు పాల్గొన్నారు.