BREAKING
నాలుగు అడుగుల ముసలి కలకలం..! ఎల్‌నినోపై విద్యార్థుల ర్యాలీ కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి లోకేష్ ఘనస్వాగతం అందుబాటు ధరల్లో క్యాన్సర్ మందులు: రోగుల ప్రయోజనాలకే ప్రథమ ప్రాధాన్యం – శ్రీ జగత్ ప్రకాశ్ నడ్డా *నారాయణ బెస్ట్ ఫౌండేషన్ స్కూల్ లో ఘనంగా బాలోత్సవ వేడుకలు..* APRS సంతనూతలపాడు పాఠశాలకు ప్రశంశాపత్రం విట్లంపల్లి తాగునీటికి శాశ్వత పరిష్కారం.. లక్ష డిజిటల్ ఎంఎస్ఎంఈల తయారీకి 50 కేంద్రాలు: మంత్రి కొండపల్లి శ్రీనివాస్ రూఫ్‌టాప్ సోలార్‌లో ఏపీ దేశానికే ఆదర్శం: కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపికి తుఫాన్ ముప్పు! స్వర్ణ,డా. ప్రవీణ్ కుమార్ వివాహ రెసెప్షన్ కు హాజరైన పారిశ్రామిక వేత్త శిద్దా సుధీర్ కుమార్ సిరివెళ్ల నీటి కుంటలో తగ్గుతున్ననీటిమట్టం_ ---ఆందోళనలో గ్రామస్తులు రోడ్డు భద్రతా నిబంధనలు పాటిస్తూ విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి:ప్రకాశం జిల్లా పోలీసులు మంత్రి లోకేష్ సమక్షంలో రెండో రోజూ పెట్టుబడుల వరద రూ.1,05,634 కోట్ల విలువైన 24 అవగాహనా ఒప్పందాలు వైసీపీకి మరో భారీ షాక్.. టీడీపీలోకి పిట్టకాయగుళ్ల మాజీ సర్పంచ్

సర్వేకు రైతులు సహకరించాలి

Select Suryaa Now
సర్వేకు రైతులు సహకరించాలి

సర్వేకు రైతులు సహకరించాలి

    


మహేశ్వరం: రైతులు సర్వేకు సహకరించాలని కందుకూరు ఆర్డీవో జగదీశ్వర్ రెడ్డి  అన్నారు. శుక్ర వారం మహేశ్వరం మండలంలోని కొంగర ఖుర్దు రెవెన్యూ గ్రామంలో భూ భారతి  భూ సర్వే కార్యక్రమంపై రైతులకు అవగాహన కల్పించేందుకు గ్రామ సభ నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి కందుకూరు రెవెన్యూ డివిజనల్ అధికారి  జగదీశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ, భూ భారతి కార్యక్రమం ద్వారా భూ రికార్డుల నిర్వహణలో పారదర్శకత, ఖచ్చితత్వం పెంపొందించడంతో పాటు భూ సమస్యల పరిష్కారానికి అవకాశం కలుగుతుందని తెలిపారు. భూ సర్వే నిర్వహణ  ప్రాముఖ్యతను వివరిస్తూ, భూముల హద్దుల నిర్ధారణ, సర్వే నంబర్ల వారీగా భూముల వివరాల నమోదు, భూ రికార్డుల సవరణ మరియు భవిష్యత్తులో భూ వివాదాల నివారణలో రీ-సర్వే కీలక పాత్ర పోషిస్తుందని వివరించారు.రైతులు తమ భూములకు సంబంధించిన పట్టాదారు పాస్ పుస్తకాలు, పాత రెవెన్యూ రికార్డులు, ఇతర సంబంధిత పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలని, సర్వే బృందాలకు పూర్తి సహకారం అందించాలని ఆర్డీఓ కోరారు. సర్వే సమయంలో తమ భూముల హద్దులను అధికారులకు చూపించి, సర్వే ప్రక్రియ సజావుగా జరిగేలా సహకరించాలని సూచించారు.
ఈ  డిప్యూటీ తహశీల్దార్ సంతోష్, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ రాజిరెడ్డి, సర్వే అధికారులు, జీపీఓలు, వివిధ శాఖల అధికారులు గ్రామ రైతులు పాల్గొన్నారు.


పాల జనార్ధన్, మేజర్ న్యూస్ మహేశ్వరం రంగారెడ్డి జిల్లా