సమాజ హితమే నా లక్ష్యం.: ఘనంగా ఉపాధ్యాయుడు చంద్రశేఖర్ వర్మ పదవీ విరమణ వేడుక :
సూర్య పెంబి మండలం.:
రూ.3.80 లక్షల సొంత నిధులతో పిరమిడ్ ధ్యాన కేంద్రం నిర్మాణం
ఘనంగా ఉపాధ్యాయుడు చంద్రశేఖర్ వర్మ పదవీ విరమణ వేడుక :
సమాజ హితమే లక్ష్యంగా పనిచేస్తూ విద్యార్థుల భవిష్యత్తు కోసం కృషి చేసిన ఉపాధ్యాయుడు చంద్రశేఖర్ వర్మ సేవలు అభినందనీయమని పలువురు కొనియాడారు. పెంబి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శనివారం ఆయన పదవీ విరమణ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ వర్మ, ఆయన భార్య పుష్పను సన్మానించి జ్ఞాపికలు అందజేశారు.
విద్యార్థుల్లో ఏకాగ్రత, మానసిక ప్రశాంతత పెంపొందించాలనే లక్ష్యంతో తన కష్టార్జితమైన రూ.3.80 లక్షలతో పాఠశాలలో పిరమిడ్ ధ్యాన కేంద్రాన్ని నిర్మించారు. తన గురువు పత్రిజీ స్ఫూర్తితో ఈ నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. పెంబి పాఠశాలలో పనిచేయడం ఎంతో తృప్తినిచ్చిందని, పదవీ విరమణ అనంతరం కూడా మండల ప్రజల సంక్షేమానికి కృషి చేస్తానని చంద్రశేఖర్ వర్మ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు రాంచందర్, గ్రామ సర్పంచ్ సత్యనారాయణ స్వామి, ప్రజాప్రతినిధులు, విశ్రాంత ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.