BREAKING
ఆర్ఎస్ఆర్ ఇంజనీరింగ్ కళాశాల డైరెక్టర్ కె. రాజా రెడ్డి మృతి పట్ల మాజీ ఎమ్మెల్యే దంపతులు కుటుంబానికి పరామర్శ. ఓటర్లందరికీ ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్పులు - కమిషనర్, అదనపు ఎన్నికల అధికారి వై.ఓ నందన్ 16 డివిజన్ కార్పొరేటర్ గా గెలిపించండి... ఆదర్శ డివిజన్ గా తీర్చిదిద్దుతా... టిడిపి కార్పొరేటర్ అభ్యర్థి నాగభూషణం ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు ఉచిత కోచింగ్ ప్రారంభించిన ఎస్పీ ఎన్ ఎల్ ఎస్ ఏ రాష్ట్ర అధ్యక్షుడిగా కానాల కూటమి అభ్యర్థుల గెలుపుకై ఎమ్మెల్యే బీవీ విస్తృత ప్రచారం నామినేషన్ల పరిశీలన కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ జెడ్పీటీసీ అభ్యర్థులు హరీష్ రావుకు దసరా శుభాకాంక్షలు తెలిపిన ఇంద్రేశం చైర్మన్ ప్రమీల,కౌన్సిలర్ అంతిరెడ్డి భూముల రీ-సర్వే పకడ్బందీగా నిర్వహించాలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి సమక్షంలో టీడీపీలో చేరిన వైకాపా ఎస్సీ సెల్ నేత నన్నం జస్టిస్. 53వ డివిజన్ ప్రచారంలో జోరుగా దూసుకుపోతున్న శంకర్ యాదవ్ విక్రమ సింహపురి యూనివర్సిటీ అంతర కళాశాలలో ఆటలపోటీలు నిర్వహించారు. లే అవుట్ లను పరిశీలించిన కమిషనర్ కౌంటింగ్ కేంద్రాన్ని పరిశీలించిన అధికారులు హరీష్ రావుకు దసరా శుభాకాంక్షలు తెలిపిన ఇస్నాపూర్ చైర్మన్ మోటే సుమలత శ్రీకాంత్ దంపతులు

-పుణ్యపురంలో ఉచిత మెగా వైద్య శిబిరం.. --ప్రజలకు వైద్య సేవలు అందించిన సర్పంచ్ మరియమ్మ --గ్రేస్ జనరల్ హాస్పిటల్ సహకారంతో నిర్వహణ. --ఉచితంగా బీపీ, షుగర్, కంటి పరీక్షలు.. --అవసరమైన వారికి మందుల పంపిణీ

Select Suryaa Now
-పుణ్యపురంలో ఉచిత మెగా వైద్య శిబిరం..  --ప్రజలకు వైద్య సేవలు అందించిన సర్పంచ్ మరియమ్మ  --గ్రేస్ జనరల్ హాస్పిటల్ సహకారంతో నిర్వహణ.  --ఉచితంగా బీపీ, షుగర్, కంటి పరీక్షలు..  --అవసరమైన వారికి మందుల పంపిణీ

--పుణ్యపురంలో ఉచిత మెగా వైద్య శిబిరం..

--ప్రజలకు వైద్య సేవలు అందించిన సర్పంచ్ మరియమ్మ

--గ్రేస్ జనరల్ హాస్పిటల్ సహకారంతో నిర్వహణ.

--ఉచితంగా బీపీ, షుగర్, కంటి పరీక్షలు..

--అవసరమైన వారికి మందుల పంపిణీ

వైరా రూరల్ (సూర్య న్యూస్):-

ఖమ్మం జిల్లా వైరా మండలం పుణ్యపురం గ్రామంలో సర్పంచ్ యంగల మరియమ్మ ఆధ్వర్యంలో గ్రేస్ జనరల్ హాస్పిటల్, తనికెళ్ల వారి సహకారంతో శనివారం స్థానిక గ్రామపంచాయతీ కార్యాలయంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. గ్రామీణ ప్రజలకు వైద్య సేవలను చేరువ చేయాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఈ శిబిరానికి గ్రామస్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
ఈ శిబిరంలో గ్రేస్ జనరల్ హాస్పిటల్ నుంచి వచ్చిన వైద్య బృందం గ్రామస్తులకు ఉచితంగా రక్తపోటు (బీపీ), మధుమేహం (షుగర్) పరీక్షలు నిర్వహించింది. అదేవిధంగా కంటి పరీక్షలు చేసి, వైద్యుల సూచనల మేరకు అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. గ్రామంలోనే వైద్య పరీక్షలు అందుబాటులోకి రావడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు.
ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యమిస్తూ సర్పంచ్ యంగల మరియమ్మ చేపట్టిన ఈ కార్యక్రమం గ్రామస్తుల ప్రశంసలు అందుకుంది. పేద, మధ్యతరగతి ప్రజలకు ఉచితంగా వైద్య పరీక్షలు, మందులు అందించడం ఎంతో ఉపయోగకరమని గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు. వైద్య శిబిరం విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన గ్రేస్ జనరల్ హాస్పిటల్ యాజమాన్యానికి, వైద్య బృందానికి గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.