BREAKING
ఎన్నికల స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ సెంటర్ ను తనిఖీ చేసిన ఎన్నికల జనరల్ అబ్జర్వర్ ఐదు సొసైటీల్లో పదవుల భర్తీపై ఆసక్తి.. సామాజిక సమీకరణాల చుట్టూ చర్చలు చికిత్స పొందుతూ వ్యక్తి మృతి డీసీఎం ఢీ కొట్టిన ఘటనలో మృత్యు ఒడిలోకి మూడో వ్యక్తి హెచ్‌ఐవీ నియంత్రణలో 95-95-95 లక్ష్యాల సాధనకు ప్రత్యేక కార్యాచరణ* *మొదటి రెండు లక్ష్యాలను 100 శాతానికి చేర్చేలా చర్యలు చేపట్టాలి* *మొబైల్ ఐసీటీసీ వాహనాల ద్వారా విస్తృతంగా పరీక్షలు నిర్వహించాలి* *జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి* స్వర హాస్పిటల్‌ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం గురువే సమాజ ప్రగతికి పునాది 'ఫీల్ గుడ్' చిత్రం నుండి యూత్‌ఫుల్ మెలోడీ 'మమ్మా మియా' పాట విడుదల జాబ్‌కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ 125 రోజులు పని పొందాలి - జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా శివపూర్ గ్రామంలో ఘనంగా వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం - చైర్మన్ నాగం గంగారం మూడు నామినేషన్లు తిరస్కరణ రోడ్డు ప్రమాద బాధితులకు మెరుగైన వైద్యం అందించడంలో పీఎం రాహత్ పథకం కీలక పాత్ర పోషిస్తుంది : రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు మృత సర్పంచ్ కుటుంబానికి అండగా ఉంటా: స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పరిషత్తు పోరు"నామినేషన్" సక్రమం...ఇక అసలైన సమరం! కీర్తి సురేష్, రాధికా ఆప్టేల ‘అక్క’ ట్రైలర్ విడుదల: అక్టోబర్ 30న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల విద్యార్థులు మాదాకద్రవ్యాలకు దూరంగా ఉండాలి

ప్రజావాణి కార్యక్రమానికి మండల స్థాయి అధికారులు హాజరు కావాలి హుస్నాబాద్ ఎంపీడీవో సురేష్ కుమార్

Select Suryaa Now
ప్రజావాణి కార్యక్రమానికి మండల స్థాయి అధికారులు హాజరు కావాలి హుస్నాబాద్ ఎంపీడీవో సురేష్ కుమార్

ప్రజావాణి కార్యక్రమానికి మండల స్థాయి అధికారులే హాజరు కావాలి

ప్రజావాణి గొప్ప కార్యక్రమం: ఎంపీడీవో సురేష్ కుమార్

హుస్నాబాద్

ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని, వాటి పరిష్కారానికి వేదికగా నిలుస్తున్న ప్రజావాణి కార్యక్రమం ఎంతో గొప్పదని హుస్నాబాద్ ఎంపీడీవో సురేష్ కుమార్ అన్నారు. ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కారం పొందేందుకు ప్రజావాణి ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.

ప్రజావాణి కార్యక్రమానికి మండల స్థాయి అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలని ఆయన స్పష్టం చేశారు. తమ శాఖలకు సంబంధించిన సమస్యలపై ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపై ఉందన్నారు. మండల స్థాయి అధికారులు స్వయంగా హాజరుకాకుండా కింది స్థాయి సిబ్బందిని పంపిస్తే సహించేది లేదని హెచ్చరించారు.

ప్రజావాణి ప్రాధాన్యతను గుర్తించి ప్రతి శాఖ అధికారి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం కార్యాలయాల చుట్టూ తిరగకుండా, ప్రజావాణి ద్వారా అందించే ఫిర్యాదులపై అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించి కింది స్థాయి అధికారులను పంపించే శాఖలపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ఎంపీడీవో సురేష్ కుమార్ స్పష్టం చేశారు.

నేటి సూర్య దినపత్రిక రిపోర్టర్ గుర్రపు శ్రీనివాస్  హుస్నాబాద్