BREAKING
అభివృద్ధి కోసం ఓటేయండి.. ఇంటింటా ప్రచారంలో 11వ వార్డు టిడిపి కౌన్సిలర్ అభ్యర్థి షకీరా మౌలాలి సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి -- జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్, సైబర్ క్రైమ్ డిఎస్పి కాజల్ భారత్ ఘన విజయం: న్యూజిలాండ్‌తో రెండో టీ20లో తిలక్ వర్మ మెరుపులు, సిరీస్‌ కైవసం కే-రిడ్జ్ స్కూల్‌లో ఎన్‌సీసీకి 25 మంది విద్యార్థుల ఎంపిక క్రిస్ట్‌చర్చ్‌లో తిలక్ వర్మ అద్భుత బ్యాటింగ్ విన్యాసం: ఎటాక్ చేయాల్సిన సమయంపై మాస్టర్ క్లాస్ ఎన్నికలకు స్వేచ్ఛగా జరిగేందుకు అందరూ సహకరించండి ఎస్ఐ మల్లికార్జున రావు ఎంపీ శ్రీకృష్ణదేవరాయలుతో ఆర్యవైశ్య ప్రముఖుల ఆత్మీయ భేటీ 28న జిల్లా స్థాయి రోల్‌ప్లే, జానపద నృత్య పోటీలు ఏయూ పూర్వ విద్యార్థుల స్పంద‌న అపూర్వం 10 వార్డు టిడిపి కౌన్సిలర్ అభ్యర్థి షేక్ షరీఫున్ ఇంటింటా ప్రచారం స్కేటింగ్, చెస్ పోటీలలో భాష్యం ప్రతిభ ఒక అవకాశం ఇవ్వండి వార్డును అభివృద్ధి చేసి చూపిస్తా... * 48 వ వార్డు స్వతంత్ర అభ్యర్థి కోయిలాడ సూర్యకళ (నవ్య) * క్రాస్ కంట్రీలో వాగ్దేవి విద్యార్థుల సత్తా ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలను కూల్చివేతలు- తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి గ్రామాల వారీగా అభివృద్ధి పై సమీక్ష నిర్వహించిన మంత్రి

మృతి చెందిన సర్పంచ్ కుటుంబానికి అండగా ఉంటా: స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్

Select Suryaa Now
మృతి చెందిన సర్పంచ్ కుటుంబానికి అండగా ఉంటా: స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్

వికారాబాద్, మేజర్ న్యూస్: ధరూర్ మండలం అల్లిపూర్ గ్రామ సర్పంచ్ గొట్టిముక్కల వీరేశం కుటుంబానికి అండగా ఉంటానని తెలంగాణ శాసనసభాపతి, వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ భరోసా ఇచ్చారు. 28 రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందిన వీరేశం కుటుంబ సభ్యులను శనివారం ఆయన పరామర్శించి, వారి దుఃఖంలో పాలుపంచుకున్నారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతూ, ఏ కష్టమొచ్చినా అండగా ఉంటానని భరోసా కల్పించారు.వీరేశం వైద్య చికిత్స కోసం చేసిన ఖర్చులకు సంబంధించి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆర్థిక సహాయం అందేలా కృషి చేస్తానని స్పీకర్ హామీ ఇచ్చారు. కుటుంబ సభ్యులు ధైర్యం కోల్పోవద్దని, అవసరమైన సమయంలో సహాయ సహకారాలు అందించేందుకు తాను సిద్ధంగా ఉంటానని తెలిపారు. మృతుడి కుటుంబానికి ప్రభుత్వం తరఫున అందాల్సిన సహాయం అందేలా కృషి చేస్తానని పేర్కొన్నారు.