BREAKING
వైసిపి దాడిని ఖండించిన తెలుగుదేశం పార్టీ నేత ధర్మతేజ. భీమవరంలో భారీ దొంగతనాల కేసు 24 గంటల్లో ఛేదన శ్రీనిధి అపార్ట్‌మెంట్‌లో వరుస చోరీలు.. నిందితుడి అరెస్ట్ రూ.1.08 కోట్ల విలువైన బంగారం, వెండి, నగదు స్వాధీనం ప్రశాంత వాతావరణంలో ముగిసిన అసిస్టెంట్ సైంటిస్ట్ పరీక్ష స్కౌట్ మాస్టర్లు, గైడ్ కెప్టెన్లకు శిక్షణ శిబిరాలు ఈ నెల 25 నుంచి మునిపల్లి మండలం లింగంపల్లిలో ప్రారంభం దివ్యాంగుల జీవితాల్లో వెలుగులు నింపుతున్న ‘సంకల్పం’ 100 మందికి పైగా దివ్యాంగులకు కృత్రిమ అవయవాల కోసం కొలతల సేకరణ ట్రస్ట్ సేవలు ఆదర్శనీయం: ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ బొత్స సత్యనారాయణ ఫ్యామిలీ కి షాక్.... నగరం మండలంలో ఒక్క నామినేషన్ తిరస్కరణ - డబుల్ ఎంట్రీలో 6 నామినేషన్లు తొలగింపు ఎన్నికలకు ప్రజల సహకరించాలి సిరిమాను సంబరాలలో మంజూష బ్రుందన్రుత్యాలు గిరిజనుడి భూమి తిరిగి అప్పగించండి అనాకోడేరులో అక్రమ మద్యం విక్రయాలు.. ఒకరి అరెస్టు బెల్ట్ షాపుపై ఎక్సైజ్ అధికారుల దాడి.. 6 మద్యం సీసాలు స్వాధీనం జనసైనికులతో టీడీపీ నేత కొలకలపూడి బ్రహ్మారెడ్డి ఆత్మీయ సమావేశం వైసీపీ నామినేషన్లపై అభ్యంతరం తెలిపిన టీడీపీ. నాగర్ కర్నూల్ మండల పరిధిలోని గన్యాగుల గ్రామంలో మనస్థాపంతో ఇంట్లో ఉరివేసుకొని యువకుడి ఆత్మహత్య జ్ఞానేశ్ కుమార్‌ను తక్షణమే విధుల నుంచి తొలగించాలి

ఏయూ పూర్వ విద్యార్థుల స్పంద‌న అపూర్వం

Select Suryaa Now
ఏయూ పూర్వ విద్యార్థుల స్పంద‌న అపూర్వం

విశాఖ ఎడ్యుకేషన్ అక్టోబ‌ర్ 24 మేజర్ న్యూస్ : ఆంధ్ర‌విశ్వ‌విద్యాల‌యం ప‌ట్ల పూర్వ విద్యార్థుల నుంచి అపూర్వ‌మైన స్పంద‌న ల‌భించింద‌ని ఏయూ వీసీ ఆచార్య జి.పి రాజ‌శేఖ‌ర్ అన్నారు. ఇటీవ‌ల అమెరికాలో స్థిర‌ప‌డిన ఏయూ పూర్వ‌విద్యార్థుల ఆహ్వానంపై అమెరికాలో ప‌ర్య‌టించిన వీసీ అక్క‌డ స‌ద‌స్సుల వివ‌రాల‌ను ఏయూ ఆచార్యుల‌తో ఈ రోజు పంచుకున్నారు. ఈ సంద‌ర్భంగా వీసీ ఆచార్య రాజ‌శేఖ‌ర్ మాట్లాడుతూ అమెరికాలో అత్యున్న‌త స్థానాల‌లో ఏయూ పూర్వ విద్యార్థులు స్థిర‌ప‌డ్డార‌ని, వారంతా క‌లిసి అమెరికాలో ఏయూ శ‌తాబ్ధి ఉత్స‌వాల‌ను ఘ‌నంగా నిర్వ‌హించార‌న్నారు. ఏయూ నుంచి వెళ్లిన వీరంతా సాధించిన ప్ర‌గ‌తి, వారి విజ‌యాలు ఎంతో స్ఫూర్తిని అందిస్తాయ‌న్నారు. పూర్వ విద్యార్థుల‌తో అనుసంధానం చేస్తూ, వారితో అనుబంధాన్ని మ‌రింత బ‌లోపేతం చేయ‌డానికి ఈ ప‌ర్య‌ట‌న ఎంతో ఉప‌క‌రించింద‌న్నారు.

ప‌ర్య‌ట‌న‌లో భాగంగా హూస్ట‌న్‌లో పూర్వ‌విద్యార్థుల స‌మ్మేళ‌నం, నాసా సంద‌ర్శ‌న‌, హూస్ట‌న్ విశ్వ‌విద్యాల‌యం సంద‌ర్శ‌న‌, పెన్ స్టేట్ యూనివ‌ర్సిటీ సంద‌ర్శ‌న‌, న్యూజెర్సీలో పూర్వ‌విద్యార్థుల స‌మ్మేళ‌నం వంటి కార్య‌క్ర‌మాల‌ను ఎంతో విజ‌య‌వంతంగా, స‌మ‌ర్ధ‌వంతంగా, స‌మ‌న్వ‌యంతో ఏయూ పూర్వ‌విద్యార్థులు నిర్వ‌హించిన విధానాన్ని ప్ర‌శంసించారు. దీనికి కృషి చేసిన పూర్వ విద్యార్థుల‌కు, ప‌ర్య‌ట‌న‌కు అనుమ‌తి మంజూరు చేసిన రాష్ట్ర ప్ర‌భుత్వానికి ఏయూ త‌ర‌పున కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేశారు.

హూస్ట‌న్ కాన్సుల్ జ‌న‌ర‌ల్ అక్క‌డి విశ్వ‌విద్యాల‌యాల‌తో ఏయూను అనుసంధానించే దిశ‌గా సంపూర్ణ స‌హ‌కారం అందిస్తామ‌ని తెలిపార‌న్నారు. హూస్ట‌న్ విశ్వ‌విద్యాల‌యంతో ఎంఓయూ ప్ర‌తిపాద‌న చేసామ‌న్నారు. టెక్సాస్ ఏ అండ్ ఎం విశ్వ‌విద్యాల‌యం సంద‌ర్శ‌న‌, అక్క‌డ ప‌నిచేస్తున్న ఏయూ పూర్వ‌విద్యార్థుల విజ‌యాలు త‌న‌కు ఎంతో సంతోషాన్ని క‌లిగించాయ‌న్నారు. అడ్వాన్స్‌డ్ లాబ‌రేట‌రీల సంద‌ర్శ‌న‌, పెన్ స్టేట్ యూనివ‌ర్సిటీ సంద‌ర్శించి అక్క‌డ అత్యున్న‌త స్థానంలో ఉన్న ఏయూ పూర్వ విద్యార్థిని నీలి బెండ‌పూడిని క‌ల‌వ‌డం జ‌రిగింద‌న్నారు. అదే విధంగా క్రిటిక‌ల్ మిన‌ర‌ల్స్ ప్లాంట్ సంద‌ర్శ‌న‌, ఏయూ నుంచి ప‌లు ప్ర‌తిపాద‌న‌లు చేయ‌డం జ‌రిగింద‌న్నారు.

న్యూజెర్సీలో జ‌రిగిన మెగా ఈవెంట్‌లో ప్ర‌ముఖ వైద్యులు నోరి ద‌త్తాత్రేయుడు పాల్గొన‌డం, అక్క‌డి మేయ‌ర్‌, గ‌వ‌ర్న‌ర్‌లు ఏయూను ప్ర‌శంసిస్తూ అందించిన ప్ర‌త్యేక ప్ర‌శంస ప‌త్రం ఎంతో సంతృప్తిని ఇచ్చాయ‌న్నారు. అమెరికా ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ముఖ్యంగా ప‌రిశోధ‌న అవ‌కాశాల‌ను విస్తృతం చేయ‌డం, క‌రికులంను అధునాత‌న అవ‌స‌రాల‌కు అనుగుణంగా తీర్చిదిద్ద‌డం, పూర్వ విద్యార్థుల స‌హ‌కారం, భాగ‌స్వామ్యం స్వీక‌రించ‌డం ప్ర‌ధానంగా సాగింద‌న్నారు.

పూర్వ విద్యార్థులు ఏయూ ప‌ట్ల అమిత‌మైన అభిమానాన్ని చూపుతున్నార‌ని, వీరు విభిన్న విధాలుగా ఏయూ ప్ర‌గ‌తిలో భాగం కావాల‌ని, స‌హ‌కారం అందించ‌డానికి ఆస‌క్తి వ్య‌క్తం చేయ‌డం జ‌రిగింద‌న్నారు. దీనికోసం ఒక పార‌ద‌ర్శ‌క‌మైన వ్య‌వ‌స్థ‌ను ఏర్పాటు చేస్తామ‌న్నారు. దీనిలో భాగంగా విదేశాల‌లో స్థిర‌ప‌డిన వారు నిధులు పంప‌డానికి అనుమ‌తులు, వారికి ప‌న్ను మిన‌హాయింపు క‌ల్పించే విధానాల‌పై తాము దృష్టి సారించామ‌న్నారు. నిధుల కంటే పూర్వ విద్యార్థుల భాగ‌స్వామ్యం, మార్గ‌ద‌ర్శ‌కం, స‌హ‌కారానికి అధిక ప్రాధాన్య‌త ఇవ్వ‌డం జ‌రుగుతోంద‌న్నారు. ఏయూ ఆలుమ్ని ఫౌండేష‌న్ ప్రారంభించే ఆలోచ‌న ఉంద‌న్నారు. అదే విధంగా ఏయూ ఎండోమెంట్ పాల‌సీ డ్రాఫ్ట్ ను త‌యారు చేసామ‌న్నారు. దీనిలో భాగంగా ఎండోమెంట్‌, ప్రైజ్‌, గోల్డ్ మెడ‌ల్‌, స్కాల‌ర్‌షిప్‌, చైర్ ప్రొఫెస‌ర్‌, సెంట‌ర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌, రీసెర్చ్-డెవ‌ల‌ప్‌మెంట్‌, భ‌వ‌నాల నిర్మాణం త‌దిత‌ర అంశాలు ఉంటాయ‌న్నారు. పూర్వ విద్యార్థుల ఆస‌క్తికి అనుగుణంగా వారిని వీటిలో భాగం చేయ‌డం జ‌రుగుతుంద‌న్నారు. ప్ర‌ధానంగా ప్ర‌తీ వారం ఒక రోజు ఆలుమ్ని ఎంగేజ్‌మెంట్ కార్య‌క్ర‌మం ఏర్పాటుచేసి, విదేశాల‌లో, భార‌త్‌లో స్థిర‌ప‌డిన పూర్వ విద్యార్థుల‌తో నేటి త‌రాన్ని అనుసంధానించే విధంగా ప‌నిచేస్తామ‌న్నారు.

కార్య‌క్ర‌మంలో భాగంగా అమెరికా విశ్వ‌విద్యాల‌యాల జ్ఞాపిక‌ల‌ను ఏయూ రెక్టార్ ఆచార్య పులిపాటి కింగ్‌, రిజిస్ట్రార్ ఆచార్య కె.రాంబాబుల‌కు అంద‌జేశారు. కార్య‌క్ర‌మంలో అంత‌ర్జాతీయ విద్యార్థి వ్య‌వ‌హారాల డీన్ ఆచార్య పాల్ డ‌గ్ల‌స్‌, పాల‌క మండ‌లి స‌భ్యులు, ప్రిన్సిపాల్స్‌, విభాగాధిప‌తులు, ఆచార్యులు పాల్గొన్నారు.

రిపోర్టర్ : సత్యనారాయణ, ఏయూ, విశాఖపట్నం.