నాగర్ కర్నూల్ మండల పరిధిలోని గన్యాగుల గ్రామంలో మనస్థాపంతో ఇంట్లో ఉరివేసుకొని యువకుడి ఆత్మహత్య
ఒంటరితనాన్ని భరించలేక మనస్థాపానికి గురైన యువకుడు ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య పాల్పడిన సంఘటన శుక్రవారం అర్ధరాత్రి చోటు చేసుకోగా శనివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్సై వెంకట్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం మండల పరిధిలోని గన్యాగుల గ్రామానికి చెందిన వెంకటేష్ (22) హైదరాబాదులో డ్రైవింగ్ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.. తన తల్లి మృతి చెందడంతో మనస్థాపానికి గురై ఒంటరితనాన్ని భరించలేక శుక్రవారం గన్యాగుల గ్రామానికి వచ్చి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శనివారం ఉదయం గమనించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటన స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం జనరల్ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. సంఘటనకు సంబంధించి మృతుడి మేనమామ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెల్లడించారు..
పి. వినయ్ కుమార్, నాగర్‌కర్నూల్ క్రైమ్ సూర్య న్యూస్