BREAKING
ఖండవల్లిలో కూటమి జడ్పీటీసీ అభ్యర్థి ఇంటింటా ఎన్నికల ప్రచారం రూ.195 కోట్లతో నిడదవోలు పట్టణాభివృద్ధి:మంత్రి కందుల దుర్గేష్ ఎస్ జి ఎఫ్ రాష్ట్ర స్థాయి హాకీ పోటీలకు పందలపాక విద్యార్థులు ఎంపిక జనసేన పార్టీ నుండి వైయస్సార్ పార్టీలో చేరికలు నేటి పంచాంగం 26 అక్టోబర్ 2026 నేటి రాశి ఫలాలు –26 అక్టోబర్ 2026 అంబాజీపేటలో శ్రీ విజయ భేతాళస్వామి వాహన మహోత్సవం.. గుగులోతు రామస్వామి నాయక్ కు ఘన సన్మానం అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకోవాలి-డిసిసి ప్రధాన కార్యదర్శి శ్రీపాల్ రెడ్డి ప్రమాదవశాత్తు నిప్పంటుకొని వృద్ధురాలికి తీవ్ర గాయాలు గంజాయి రవాణా చేస్తున్న మహారాష్ట్ర పోలీస్ కానిస్టేబుల్-ఆరు లక్షల విలువైన 12 కిలోల గంజాయి పట్టివేత సాయినగర్ కాలనీలో ఎమ్మెల్సీ పట్టభద్రుల ఓటరు నమోదు ఎన్‌టీఆర్‌ నగర్‌లో కిడ్నాప్‌ కలకలం.... గంటల్లోనే కిడ్నాప్‌నకు గురైన వ్యక్తిని గుర్తించిన గచ్చిబౌలి పోలీసులు . జీహెచ్‌ఎంసీ మహిళా కార్మికులకు చీరల పంపిణీ చేసిన బలరాం యాదవ్ పట్టభద్రులు ఓటర్లుగా నమోదు కావాలి: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు

శ్రీ రామకృష్ణ ఇంటర్నేషనల్‌ సంస‍్థ తెలంగాణ అధ్యక్షుడిగా మణిదీప్‌

Select Suryaa Now
శ్రీ రామకృష్ణ ఇంటర్నేషనల్‌ సంస‍్థ తెలంగాణ అధ్యక్షుడిగా మణిదీప్‌

హైదరాబాద్, సూర్య ప్రతినిధి :ప్రముఖ ఆధ్యాత్మిక, సాంస్కృతిక సంస్థ శ్రీరామకృష్ణ ఇంటర్నేషనల్‌ తెలంగాణ శాఖ అధ్యక్షుడిగా నగరానికి చెందిన ప్రముఖ సేవావేత్త, రెడ్‌క్రాస్‌ సొసైటీ జిల్లా వైస్‌ చైర్మన్‌ వి.మణిదీప్‌ ఎంపికయ్యారు. ఈమేరకు ఆయన శనివారం బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎన్.రాంచందర్ రావు, శ్రీ రామకృష్ణ ఇంటర్నేషనల్ అధ్యక్షులు గురు శ్రీ మహేందర్ దాస్ మహారాజ్ జీ చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందుకున్నారు. అనంతరం వీరి చేతుల మీదుగానే తెలంగాణలో ‘ఘర్‌ ఘర్‌ రామ్, హర్ ఘర్ రామాయణ్‌’ కార్యక్రమాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మణిదీప్‌ మీడియాతో మాట్లాడుతూ శ్రీ రామకృష్ణ ఇంటర్నేషనల్ వంటి సంస్థకు తెలంగాణ అధ్యక్షుడిగా నియమితులవడం ఎంతో గౌరవంగా భావిస్తున్నానని చెప్పారు. తెలంగాణలో సంస్థ సిద్ధాంతాలను, ఆశయాలను వ్యాప్తి చేసేందుకు తనవంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. శ్రీరాముడి ఆదర్శాలను, రామాయణం సందేశాన్ని తెలంగాణలోని​ప్రతి ఇంటికి చేరేలా అంకితభావంతో పనిచేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో బీజేపీ తెలంగాణ ఎండోమెంట్ సెల్ రాష్ట్ర కన్వీనర్ అన్నవజుల సూర్యప్రకాశ్, రాష్ట్ర కో-కన్వీనర్ నిరంజన్ దేశాయ్, బీజేపీ సినిమా సెల్ కన్వీనర్ వైభవ్ సూర్య తదితరులు పాల్గొన్నారు.