telangana
పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు గురుద్వారాలో సీపీ గౌష్ ఆలం ప్రత్యేక ప్రార్థనలు
సూర్య కరీంనగర్ ;పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా స్థానిక గురుద్వారాలో కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం శనివారం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.సమాజ రక్షణ కోసం, శాంతిభద్రతల పరిరక్షణలో విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన పోలీస్ అమరవీరుల ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలు, సుఖశాంతులతో వర్ధిల్లాలని గురుద్వారాలో ప్రత్యేక అర్దాస్ (ప్రార్థనలు) జరిపించారు.అలాగే పోలీస్ శాఖ అధికారులు, సిబ్బంది క్షేమం, ప్రజా సంక్షేమం కోరుతూ గురుద్వారా ప్రబంధక్ కమిటీ సభ్యులతో కలిసి ప్రార్థనల్లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా సీపీ గౌష్ ఆలం మాట్లాడుతూ — సమాజ శాంతి కోసం అమరులైన పోలీసుల త్యాగాలు చిరస్మరణీయమని, వారి కుటుంబాలకు పోలీస్ శాఖ ఎల్లవేళలా అండగా నిలుస్తుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో సీపీతో పాటు ఏసీపీలు వెంకటస్వామి, విజయకుమార్, టౌన్ మరియు ట్రాఫిక్ సీఐలు, ఎస్సైలు, పోలీస్ సిబ్బంది, గురుద్వారా ప్రతినిధులు పాల్గొన్నారు.