BREAKING
ఖండవల్లిలో కూటమి జడ్పీటీసీ అభ్యర్థి ఇంటింటా ఎన్నికల ప్రచారం రూ.195 కోట్లతో నిడదవోలు పట్టణాభివృద్ధి:మంత్రి కందుల దుర్గేష్ ఎస్ జి ఎఫ్ రాష్ట్ర స్థాయి హాకీ పోటీలకు పందలపాక విద్యార్థులు ఎంపిక జనసేన పార్టీ నుండి వైయస్సార్ పార్టీలో చేరికలు నేటి పంచాంగం 26 అక్టోబర్ 2026 నేటి రాశి ఫలాలు –26 అక్టోబర్ 2026 అంబాజీపేటలో శ్రీ విజయ భేతాళస్వామి వాహన మహోత్సవం.. గుగులోతు రామస్వామి నాయక్ కు ఘన సన్మానం అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకోవాలి-డిసిసి ప్రధాన కార్యదర్శి శ్రీపాల్ రెడ్డి ప్రమాదవశాత్తు నిప్పంటుకొని వృద్ధురాలికి తీవ్ర గాయాలు గంజాయి రవాణా చేస్తున్న మహారాష్ట్ర పోలీస్ కానిస్టేబుల్-ఆరు లక్షల విలువైన 12 కిలోల గంజాయి పట్టివేత సాయినగర్ కాలనీలో ఎమ్మెల్సీ పట్టభద్రుల ఓటరు నమోదు ఎన్‌టీఆర్‌ నగర్‌లో కిడ్నాప్‌ కలకలం.... గంటల్లోనే కిడ్నాప్‌నకు గురైన వ్యక్తిని గుర్తించిన గచ్చిబౌలి పోలీసులు . జీహెచ్‌ఎంసీ మహిళా కార్మికులకు చీరల పంపిణీ చేసిన బలరాం యాదవ్ పట్టభద్రులు ఓటర్లుగా నమోదు కావాలి: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు

వెస్ట్ ఆస్ట్రేలియా కరిక్యులంతో అల్ఫోర్స్ ఇంటర్నేషనల్ స్కూల్ నైపుణ్య ఆధారిత విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలి... అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

Select Suryaa Now
వెస్ట్ ఆస్ట్రేలియా కరిక్యులంతో అల్ఫోర్స్ ఇంటర్నేషనల్ స్కూల్  నైపుణ్య ఆధారిత విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలి...   అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

సూర్య కరీంనగర్ ;విద్యార్థుల్లో నైపుణ్య ఆధారిత విద్యను ప్రోత్సహించాలని అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి. నరేందర్ రెడ్డి అన్నారు. విజయదశమి సందర్భంగా ఆస్ట్రేలియా పర్యటన విశేషాలను వెల్లడించిన ఆయన, అక్టోబర్ 17 నుంచి 22 వరకు పశ్చిమ ఆస్ట్రేలియాలోని పలు విద్యాసంస్థలను సందర్శించి అక్కడి విద్యావిధానం, కరిక్యులం, ఉపాధి అవకాశాలను పరిశీలించినట్లు తెలిపారు. అక్కడ అన్ని రంగాల విద్యకు సమాన ప్రాధాన్యత ఇస్తున్నారని, విద్యార్థులపై పరీక్షల ఒత్తిడి తగ్గించి వారి ఆసక్తులకు అనుగుణంగా సబ్జెక్టులు ఎంచుకునే అవకాశం కల్పిస్తున్నారని పేర్కొన్నారు. ఇదే స్ఫూర్తితో అల్ఫోర్స్‌లో వెస్ట్ ఆస్ట్రేలియా కరిక్యులంతో ఇంటర్నేషనల్ స్కూల్‌ను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వ ఆమోద ప్రక్రియ తుది దశలో ఉందని, వచ్చే విద్యా సంవత్సరం నుంచి నర్సరీ నుంచి రెండో తరగతి వరకు తరగతులు నిర్వహించనున్నట్లు తెలిపారు. తల్లిదండ్రులు మార్కుల కోసం పిల్లలపై ఒత్తిడి చేయకుండా ఐఐటీ, మెడిసిన్‌తో పాటు సీఏ, క్లాట్, వ్యవసాయం, క్రీడలు, సాంకేతిక విద్య వంటి విభిన్న రంగాల్లో ప్రోత్సహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అల్ఫోర్స్ ఉపాధ్యాయులు, సిబ్బంది, తల్లిదండ్రులు పాల్గొన్నారు.