ట్రేస్ ఇండియా సంస్థ ప్రతినిధి బృందం పాఠశాల సందర్శన --వ్యవస్థాపకులు దిడ్ల అంజిలో, స్విట్జర్లాండ్ దేశం నుండి వచ్చిన టుగెదర్ ఇండియా ప్రెసిడెంట్ మిస్టర్ సిగ్వి, వైస్ ప్రెసిడెంట్ మిస్టర్ మ్యాన్యుల్
ఏలూరు, మేజర్ న్యూస్ : ఎంపీపీఎస్ వైయస్సార్ కాలనీ పాఠశాలకు దాతలుగా వ్యవహరిస్తూ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ట్రేస్ ఇండియా ప్రతినిధులు పాఠశాలకు విచ్చేసి పాఠశాలను పరిశీలించారు. అత్యంత పేద పిల్లలు చదువుకుంటున్న ఈ పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులకు గతంలో 1 లక్ష 50 వేల విలువైన 26 కేజీల రైస్ బ్యాగ్, ఐదు రకాల నిత్య అవసర వస్తువులు, 50 వేల రూపాయల విలువైన8 రకాల (సబ్బులు, బ్రష్ లు, కొబ్బరి నూనె,షాంపు, పేస్ట్) అందించడం జరిగినది. అదేవిధంగా పిల్లలకు ఆట వస్తువులు, సంక్రాంతి పండుగ సందర్భంగా ముగ్గులు పోటీలు బహుమతులు( 10 వేల రూపాయలు విలువైన ) అందించారు.
త్వరలో పాఠశాల గ్రౌండ్లో విద్యార్థులు ఆడుకోవడానికి అవసరమైన 2 లక్షల రూపాయలు విలువైన జారుడుబల్లలు, ఉయ్యాలలు, విద్యార్థులు కూర్చుని గుండ్రంగా తిరిగే వస్తువులు, ఏర్పాటు చేయడానికి అంగీకరం తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయిని కె. చిట్టిలక్ష్మి పాఠశాలకు ఇంకా అవసరమైన వాటి గురించి వారికి తెలిపారు.ఎస్ఎంసి చైర్మన్ షేక్ హసీనా మాట్లాడుతూ అత్యంత పేద పిల్లలు ఉన్న ఈ పాఠశాలకు ట్రేస్ఇండియా స్వచ్ఛంద సేవ సంస్థ ద్వారా చేస్తున్న సేవా కార్యక్రమాలు పట్ల వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ మహిత, ఉపాధ్యాయ నాయకులు షేక్ ముస్తఫా ఆలీ , పంచాయతీ సెక్రెటరీ సంఘం గౌరవ అధ్యక్షులు వి ఎం జి వి ఆర్ కృష్ణారావు రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు జిజేఏ స్టీవెన్, పాఠశాల ఉపాధ్యాయినీలు లక్ష్మి , షేక్ జరీనా , కిరణ్ కుమారి పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.