బొత్స సత్యనారాయణ ఫ్యామిలీ కి షాక్....
విజయనగరం బ్యూరో, సూర్య : జడ్పీటీసీ నామినేషన్లు పర్వం ట్విస్ట్ లు మీద ట్విస్ట్ లు తో ఆసక్తి రేపుతోంది. బొత్స సత్యనారాయణ ఫ్యామిలీలో బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ గురైంది.చైతన్య ఓటు జిల్లా కేంద్రంలో ఉందంటూ జనసేన ఫిర్యాదు చేయడంతోజనసేన ఫిర్యాదు మేరకు ఎన్నికల అధికారులు చర్యలు తీసుకున్నారు.
పూసపాటి రేగ మండలం నుండి వైసీపీ తరుపున జెడ్పీటీసీ అభ్యర్థిగా బొత్స చైతన్య నామినేషన్ దాఖలు చేశారు.నామినేషన్ కి రెండు రోజులు ముందు వరకు తన ఓటు విజయనగరం కార్పొరేషన్ పరిధి 41వ డివిజన్లో ఓటు హక్కు ఉందంటూ ఆధారాలు జనసేన సమర్పించింది. అర్బన్ లో ఓటు హక్కు ఉండి, రూరల్ లో నామినేషన్ ఎలా వేస్తారంటూ జనసేన పూసపాటిరేగ జడ్పిటిసి అభ్యర్థి కోట్ల రేవతి ఫిర్యాదు చేశారు. ఈమేరకు స్క్రూటీని లో బొత్స చైతన్య నామినేషన్ ను తిరస్ఎ న్నికల అధికారి తిరస్కరించారు. దీనిపై జిల్లా వైసీపీ జిల్లా అధ్యక్షులు బెల్లాన చంద్రశేఖర్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.
రిపోర్టర్ : డేవిడ్ రాజు, విజయనగరం.