టీడీపీ జెండా ఎగరడం ఖాయం
ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్ : మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ జెండా ఎగరడం ఖాయమని తిరుపతి మేయర్ అభ్యర్థి జేబీ శ్రీనివాస్ ధీమా వ్యక్తం చేశారు. కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం
38, 39, 45 డివిజన్లలో కూటమి అభ్యర్థులతో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మేయర్ అభ్యర్థి జేబీ శ్రీనివాస్ తో పాటు యాదవ కార్పొరేషన్ ఛైర్మన్ నరసింహ యాదవ్, పార్లమెంట్ అధ్యక్షురాలు పనబాక లక్ష్మి, బీజేపీ అజయ్ కుమార్, క్లస్టర్ ఇన్ఛార్జ్ దంపూరి భాస్కర్ యాదవ్ హాజరై ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా జేబీ శ్రీనివాస్ మాట్లాడుతూ మేయర్ పీఠం టిడిపి సొంతం కావడం ఖాయమని, 66 డివిజన్లో నెలకొన్న ప్రజా సమస్యలను శాశ్వత పరిష్కారం చూపేందుకు కృషి చేస్తానని, అందుకు ప్రజలందరూ అండగా నిలిచి రానున్న నవంబర్ ఒకటో తేదీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. తిరుపతి అభివృద్ధి కూటమి ప్రభుత్వంతో సాధ్యమని, రాబోయే రోజుల్లో తిరుపతిని మరింత అభివృద్ధి చేసి అందరూ చూపు తిరుపతి వైపు చూసే విధంగా చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ అభ్యర్థులు 38 వరలక్ష్మి, 39 పింక్ జైన్, 45 మన్యం విజయలక్ష్మి, నాయకులు రుద్రకోటి సదాశివం, సింగం శెట్టి సుబ్బరామయ్య, మన్యం శ్రీనివాసులు, ఆముదాల తులసీ, ఆర్కాట్ కృష్ణ ప్రసాద్, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
సీఎం గౌడ్ తిరుపతి స్టాఫ్ రిపోర్టర్