బాణాసంచా దుకాణాలు తనిఖీ చేసిన డిఎస్పి...
అమలాపురం మేజర్ న్యూస్ దీపావళి పండుగ నేపథ్యంలో పోలీసులు ముందస్తు తనిఖీలు నిర్వహించారు. అమలాపురం డిఎస్పీ ఎస్.ఆర్.కె ప్రసాద్ శనివారం కాట్రేని కోన లోని శ్రీ వెంకట కళ్యాణి ట్రేడర్స్ బాణాసంచా దుకాణంతో పాటు పలు దుకాణాలను తనిఖీ చేశారు. దుకాణాల వద్ద అగ్నిమాపక పరికరాలు, ఇసుక బకెట్లు, నీటి సదుపాయం తప్పనిసరిగా ఉంచుకోవాలని సూచించారు.
నో స్మోకింగ్ బోర్డులు ఏర్పాటు చేయాలని, లైసెన్సు నిబంధనలు పాటించాలని నిర్వాహకులకు తెలిపారు. అనుమతులకు మించి బాణసంచా నిల్వలు ఉంచరాదని హెచ్చరించారు. ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ తనిఖీల్లో ముమ్మిడివరం సిఐ మోహన్ కుమార్, కాట్రేనికోన ఎస్సై శ్రీనివాస్ పాల్గొన్నారు