BREAKING
ప్రోస్టేట్ క్యాన్సర్ కణతులను కరిగించే సరికొత్త ఔషధం: జాన్సన్ అండ్ జాన్సన్ 'JNJ-6143' ట్రయల్స్‌లో కీలక పురోగతి.. సౌదీ అరేబియాలో చిక్కుకున్న భారతీయ ఉమ్రా యాత్రికులకు కేంద్రం అండ: సంచాలన స్కూల్ ఆఫ్ డాన్స్ ఆధ్వర్యంలో మాస్టర్స్ ఎగ్జామినేషన్ కార్తీక్ సుబ్బరాజ్ 'డోరతీ' అరుదైన చిత్రం.. ట్రాన్స్‌జెండర్ల జీవితాలకు హ్యాపీ ఎండింగ్ ఇచ్చిన డైరెక్టర్! ట్యాంకర్ల ద్వారా నీటి వృథాను అరికట్టేందుకు కఠిన చర్యలు : నవంబర్ 1 నుంచి నిబంధనల ఉల్లంఘనకు రూ.5 వేల జరిమానా నటనకు బ్రేక్ ఇవ్వడంపై ఎలాంటి రిగ్రెట్ లేదు.. అమృత పూరి ఆసక్తికర వ్యాఖ్యలు! చారిత్రక కట్టడాల పరిరక్షణ, అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి చార్మినార్ పరిసరాల్లో క్యూ క్యు ఎస్ యు డి ఎ అడ్మినిస్ట్రేటర్ పి. గౌతమి ఐఏఎస్ తనిఖీ నీటిని పొదుపుగా వాడాలి : నీటి సంరక్షణకు ‘మేము సైతం’ అంటూ ప్రతిజ్ఞ. సూమో డిడి మూవీ రివ్యూ.. భారత్ తొలి మహిళా సూమో రెజ్లర్ జీవితాధారంగా వచ్చిన సినిమా ఎలా ఉందంటే! శ్రీకృష్ణ సదర్ సమ్మేళనం–2026 . 40 ఏళ్లలో తొలిసారి.. థియేటర్‌లో అభిమానులతో కలిసి రజినీకాంత్ 'జైలర్ 2' వీక్షణం! బాక్సాఫీస్ వద్ద రజినీకాంత్ 'జైలర్ 2' సంచలనం.. రెండో వారంలోనూ తగ్గేదేలే అంటూ రూ. 369 కోట్ల వసూళ్లు! జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్‌–ఎన్‌ఎఫ్‌సీఎల్‌ జంక్షన్‌ వరకు సిగ్నల్‌ రహిత ట్రాఫిక్‌ బాక్సాఫీస్ వద్ద ఆయుష్మాన్ ఖురానా, సారా అలీ ఖాన్ 'ఉడ్తా తీర్' హవా.. రెండు రోజుల్లోనే రూ. 11 కోట్ల వసూళ్లు! లోధా అపార్ట్మెంట్స్ లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదు

నేరస్థుడిపై మరోసారి పీడీ యాక్ట్‌.. చర్లపల్లి జైలుకు తరలింపు

Select Suryaa Now
 నేరస్థుడిపై మరోసారి పీడీ యాక్ట్‌.. చర్లపల్లి జైలుకు తరలింపు

సైబరాబాద్,మేజర్ న్యూస్ : సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎం. రమేష్, ఐపీఎస్ ఆదేశాల మేరకు నాగరాజు రఘు వర్మ అలియాస్ వంశీపై మరోసారి పీడీ చట్టం ప్రయోగించారు. ఇతడిని గూండాగా పరిగణించి చర్లపల్లి సెంట్రల్ జైలుకు తరలించారు.ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన నిందితుడు, పోలీసు అధికారిగా నటిస్తూ కేసుల నుంచి తప్పిస్తానని నమ్మించి బాధితుల నుంచి డబ్బులు వసూలు చేసేవాడని పోలీసులు తెలిపారు.

 కిడ్నాప్‌లు, తుపాకులతో బెదిరింపులు, దోపిడీలు, బలవంతపు వసూళ్లకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి.2017 నుంచి 2026 మధ్య మోసం, కిడ్నాప్, దోపిడీ, బెదిరింపులు, ఆయుధ చట్టం కింద నమోదైన మొత్తం 14 కేసుల్లో ఇతడు నిందితుడిగా ఉన్నాడు. గతంలో 2021, 2024లోనూ ఇతడిపై పీడీ చట్టం ప్రయోగించారు. జైలు నుంచి విడుదలైన తర్వాత కూడా నేర కార్యకలాపాలు కొనసాగించినట్లు పోలీసులు పేర్కొన్నారు. తాజాగా జగద్గిరిగుట్ట పోలీసులు అరెస్టు చేయగా, మరోసారి నివారణ చర్యగా పీడీ చట్టం అమలు చేశారు.