రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం కుక్క అడ్డురావడంతో స్కూటీపై నుంచి పడి మృతి
చిలకలూరిపేట సూర్య న్యూస్:
స్కూటీపై వెళ్తుండగా రోడ్డుపై అకస్మాత్తుగా కుక్క అడ్డురావడంతో అదుపుతప్పి కిందపడిన వ్యక్తి తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషాద ఘటన పసుమర్రు గ్రామ పరిధిలోని లక్ష్మీ వాసవి క్రాకర్ షాపు సమీపంలో చోటుచేసుకుంది.
మార్టూరుకు చెందిన షేక్ తండ హుస్సేన్ (51) శనివారం రాత్రి 10 గంటల సమయంలో చిలకలూరిపేట నుంచి తన స్కూటీపై మార్టూరుకు వెళ్తున్నాడు. మార్గమధ్యంలో పసుమర్రు గ్రామ పరిధిలోని లక్ష్మీ వాసవి క్రాకర్ షాపు వద్దకు చేరుకోగానే, స్కూటీకి అకస్మాత్తుగా కుక్క అడ్డురావడంతో దానిని తప్పించే ప్రయత్నంలో కిందపడిపోయాడు. ఈ ప్రమాదంలో తలకు తీవ్ర రక్తగాయమై అక్కడికక్కడే మృతి చెందాడు.
మృతుడి కుమారుడు అన్సారిక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు
కొణిదెన నరేంద్ర చిలకలూరిపేట సూర్య ఆర్సి ఇంచార్జ్