BREAKING
నీటిని పొదుపుగా వాడాలి : నీటి సంరక్షణకు ‘మేము సైతం’ అంటూ ప్రతిజ్ఞ. సూమో డిడి మూవీ రివ్యూ.. భారత్ తొలి మహిళా సూమో రెజ్లర్ జీవితాధారంగా వచ్చిన సినిమా ఎలా ఉందంటే! శ్రీకృష్ణ సదర్ సమ్మేళనం–2026 . 40 ఏళ్లలో తొలిసారి.. థియేటర్‌లో అభిమానులతో కలిసి రజినీకాంత్ 'జైలర్ 2' వీక్షణం! బాక్సాఫీస్ వద్ద రజినీకాంత్ 'జైలర్ 2' సంచలనం.. రెండో వారంలోనూ తగ్గేదేలే అంటూ రూ. 369 కోట్ల వసూళ్లు! జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్‌–ఎన్‌ఎఫ్‌సీఎల్‌ జంక్షన్‌ వరకు సిగ్నల్‌ రహిత ట్రాఫిక్‌ బాక్సాఫీస్ వద్ద ఆయుష్మాన్ ఖురానా, సారా అలీ ఖాన్ 'ఉడ్తా తీర్' హవా.. రెండు రోజుల్లోనే రూ. 11 కోట్ల వసూళ్లు! లోధా అపార్ట్మెంట్స్ లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదు నూతన జిల్లా కార్యవర్గ సభ్యులను అభినందించిన మర్రి శశిధర్ రెడ్డి ఫ్రిజ్ లేకుండానే కూరగాయలు తాజాగా ఉండేలా చిట్కాలు.. ఈ చిన్న ట్రిక్స్ పాటిస్తే సరి! సైబరాబాద్ సీపీ హోంగార్డ్స్ సంఘం అధ్యక్షులుగా బొక్క గోపాల్ షీ టీమ్స్ ఆపరేషన్లలో 28 మంది అరెస్ట్ - సైబరాబాద్ డీసీపీ మహిళలు, బాలల భద్రతా విభాగం ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం: ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ఓటీటీలోకి వచ్చేసిన కన్నడ మిస్టరీ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్! దుందిగల్ అసైన్డ్ భూముల ల్యాండ్ పూలింగ్‌పై స్పష్టత ఇవ్వాలి..

ఆధ్యాత్మిక ప్రచారుకులకు ఘన సత్కారం

Select Suryaa Now
ఆధ్యాత్మిక ప్రచారుకులకు ఘన సత్కారం

నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరంఅనపర్తి, మేజర్ న్యూస్. అనపర్తి పరిసర ప్రాంతాల్లో మూడు దశాబ్దాలకు పైగా ఆధ్యాత్మిక ప్రవచనాలు, భక్తి కార్యక్రమాల ద్వారా ప్రజల్లో భక్తిభావాన్ని పెంపొందించడంలో ఓం శక్తి సత్సంగం అధ్యక్షులు మేడపాటి వెంకటరమణారెడ్డి (గురు భవాని), సత్తి రామారెడ్డి చేస్తున్న సేవలు అభినందనీయమని వ్యాపారవేత్త కర్రి సుధాకర్ రెడ్డి అన్నారు.స్థానిక వీరుళ్లమ్మ అమ్మవారి ఆలయ సన్నిధిలో త్రిశక్తి పీఠం నిర్వాహకులు మేడపాటి రామకృష్ణారెడ్డి, శివశంకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదర్శ రైతు స్వర్గీయ నల్లమిల్లి రామారెడ్డి సతీమణి చెల్లయమ్మ, కొత్తూరు గ్రామానికి చెందిన సత్తి ఆదిరెడ్డి–అరుణ దంపతులు, వారి కుమార్తె చిరంజీవి హేమ సాత్విక చేతుల మీదుగా అమ్మవారికి వివిధ ఫలాలు, పుష్పాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఆధ్యాత్మిక భక్తిగీతాలతో ఆలయ పరిసర ప్రాంతం భక్తిపారవశ్యంలో మునిగిపోయింది. ఈ సందర్భంగా ఆధ్యాత్మిక రంగంలో సేవలందిస్తున్న ప్రచారకుల కృషిని కొనియాడుతూ వారిని సత్కరించారు.ఈ కార్యక్రమంలో ఆధ్యాత్మిక భక్తులు గొలుగూరి సహదేవారెడ్డి–విజయలక్ష్మి దంపతులు, ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత దాసరి నాగమణి–చిట్టిబాబు దంపతులు, సత్సంగ ప్రతినిధులు కర్రి శ్రీనివాస్ రెడ్డి, మణికంఠ, మహేష్, హనుమాన్, బాపిరెడ్డి, నాని తదితరులు పాల్గొన్నారు.