ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం: ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు
దుండిగల్ మేజర్ న్యూస్ :ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు తెలిపారు. శనివారం దుందిగల్ మున్సిపాలిటీ పరిధిలోని శంభీపూర్‌లో ఉన్న తన కార్యాలయంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన మాజీ ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, వివిధ కాలనీల ప్రతినిధులు ఆయనను కలిశారు.
ఈ సందర్భంగా స్థానికంగా నెలకొన్న పలు సమస్యలను ఎమ్మెల్సీ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని కోరారు. సమస్యలపై సానుకూలంగా స్పందించిన శంభీపూర్ రాజు, ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని తెలిపారు. ప్రజలకు అండగా ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు.