BREAKING
బెంగళూరు ట్రాఫిక్‌తో విసిగిపోయారా? రూ.3 లక్షల కార్ హ్యాక్‌తో నెటిజన్లను ఆశ్చర్యపరిచిన టెక్కీ ముంబై రెస్టారెంట్లపై ఎఫ్‌డీఏ కొరడా: ఒట్టోమన్ కేఫ్, భారత్ క్యాంటీన్ సహా 7 హోటళ్ల లైసెన్సులు రద్దు.. ఎఫ్‌1 యునైటెడ్ స్టేట్స్ గ్రాండ్ ప్రిక్స్ క్వాలిఫైయింగ్ లైవ్ స్ట్రీమింగ్: నవంబర్ 1న రాహుల్ గాంధీ ర్యాలీతో ఢిల్లీ మార్కెట్లకు రూ.10,000 కోట్ల దెబ్బ: కేరళ లోక్ భవన్ కిచెన్‌లో మాంసాహారంపై నిషేధం: బాధ్యతలు చేపట్టిన తొలిరోజే గవర్నర్ ఓం ప్రకాష్ మాథుర్ కీలక ఆదేశాలు.. ప్రోస్టేట్ క్యాన్సర్ కణతులను కరిగించే సరికొత్త ఔషధం: జాన్సన్ అండ్ జాన్సన్ 'JNJ-6143' ట్రయల్స్‌లో కీలక పురోగతి.. సౌదీ అరేబియాలో చిక్కుకున్న భారతీయ ఉమ్రా యాత్రికులకు కేంద్రం అండ: సంచాలన స్కూల్ ఆఫ్ డాన్స్ ఆధ్వర్యంలో మాస్టర్స్ ఎగ్జామినేషన్ కార్తీక్ సుబ్బరాజ్ 'డోరతీ' అరుదైన చిత్రం.. ట్రాన్స్‌జెండర్ల జీవితాలకు హ్యాపీ ఎండింగ్ ఇచ్చిన డైరెక్టర్! ట్యాంకర్ల ద్వారా నీటి వృథాను అరికట్టేందుకు కఠిన చర్యలు : నవంబర్ 1 నుంచి నిబంధనల ఉల్లంఘనకు రూ.5 వేల జరిమానా నటనకు బ్రేక్ ఇవ్వడంపై ఎలాంటి రిగ్రెట్ లేదు.. అమృత పూరి ఆసక్తికర వ్యాఖ్యలు! చారిత్రక కట్టడాల పరిరక్షణ, అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి చార్మినార్ పరిసరాల్లో క్యూ క్యు ఎస్ యు డి ఎ అడ్మినిస్ట్రేటర్ పి. గౌతమి ఐఏఎస్ తనిఖీ నీటిని పొదుపుగా వాడాలి : నీటి సంరక్షణకు ‘మేము సైతం’ అంటూ ప్రతిజ్ఞ. సూమో డిడి మూవీ రివ్యూ.. భారత్ తొలి మహిళా సూమో రెజ్లర్ జీవితాధారంగా వచ్చిన సినిమా ఎలా ఉందంటే! శ్రీకృష్ణ సదర్ సమ్మేళనం–2026 .

దుందిగల్ అసైన్డ్ భూముల ల్యాండ్ పూలింగ్‌పై స్పష్టత ఇవ్వాలి..

Select Suryaa Now
దుందిగల్ అసైన్డ్ భూముల ల్యాండ్ పూలింగ్‌పై స్పష్టత ఇవ్వాలి..

దుందిగల్ రైతుల సమస్యను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దృష్టికి తీసుకెళ్లిన బొంగునూరి కిషోర్ రెడ్డి, కావలి గణేష్

దుండిగల్ మేజర్ న్యూస్ :మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా, కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుందిగల్ గ్రామంలోని రైతుల భూ సమస్యపై తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార, పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని తెలంగాణ రాష్ట్ర ప్రోటోకాల్ వైస్ చైర్మన్ బొంగునూరి కిషోర్ రెడ్డి, దుందిగల్ మాజీ సర్పంచ్ కావలి గణేష్‌తో పాటు పలువురు రైతులు శనివారం కలిశారు. దుందిగల్ గ్రామ పరిధిలోని సర్వే నంబర్లు 453, 454లో ఉన్న అసైన్డ్ భూముల ల్యాండ్ పూలింగ్ అంశంపై స్పష్టత ఇవ్వాలని వారు మంత్రిని కోరారు. 

గత మూడు నెలలుగా రెవెన్యూ అధికారులు రైతులతో గ్రామసభలు నిర్వహించినప్పటికీ, తదుపరి ప్రక్రియపై స్పష్టమైన సమాచారం అందకపోవడంతో రైతులు తమ సమస్యను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ల్యాండ్ పూలింగ్‌కు సంబంధించిన వివరాలను వెల్లడించి, రైతుల్లో నెలకొన్న సందేహాలను నివృత్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రైతులు బొమ్మల అశోక్ ముదిరాజ్, పండుగ శ్రీశైలం ముదిరాజ్, దొంతి మహేష్ ముదిరాజ్, బిక్షపతి, కావలి శంకరయ్య, చెలకల అశోక్, చంద్రయ్య, జక్కుల కృష్ణ యాదవ్, సిరగల స్వామి తదితరులు పాల్గొన్నారు. తమ భూములకు సంబంధించిన సమస్యపై ప్రభుత్వం స్పష్టతనిచ్చి, పరిష్కార దిశగా చర్యలు తీసుకోవాలని దుందిగల్ రైతులు కోరారు.