షీ టీమ్స్ ఆపరేషన్లలో 28 మంది అరెస్ట్ - సైబరాబాద్ డీసీపీ మహిళలు, బాలల భద్రతా విభాగం
హైదరాబాద్ సిటీ బ్యూరో, మేజర్ న్యూస్ (అక్టోబర్ 24): సైబరాబాద్ షీ టీమ్స్ 185 డెకాయ్ ఆపరేషన్లు నిర్వహించి, బహిరంగ ప్రదేశాల్లో అసభ్యకరమైన చర్యలకు పాల్పడుతున్న 28 మందిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నాయి. 39 మందిపై పెట్టీ కేసులు నమోదు చేయగా, మిగిలిన వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు. వివిధ మార్గాల ద్వారా మహిళా బాధితుల నుంచి షీ టీమ్స్‌కు 11 ఫిర్యాదులు కూడా అందాయి.
సైబరాబాద్ మానవ అక్రమ రవాణా నిరోధక విభాగం, ఒక పిటా కేసులో ఇద్దరు బాధితులను రక్షించి, ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకుంది.
భార్యాభర్తల మధ్య కుటుంబ వివాదాలకు సంబంధించి, కుటుంబ కౌన్సెలింగ్ కేంద్రాలు / సి డి ఈ డబ్ల్యూ కేంద్రాల ద్వారా 17 కుటుంబాలను తిరిగి కలిపేందుకు ప్రయత్నాలు జరిగాయి.
నివారణ, అవగాహన చర్యల్లో భాగంగా, సైబరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో షీ టీమ్స్ అవగాహన కార్యక్రమాలు నిర్వహించాయి. ఈ కార్యక్రమాల్లో సుమారు 1,225 మంది పాల్గొన్నారు. వారికి మానవ అక్రమ రవాణా (బాలల అక్రమ రవాణాతో సహా), ఈవ్ టీజింగ్, సోషల్ మీడియా వేధింపులు, బాల్య వివాహాలు, బాలల హక్కులు, బాల కార్మికత్వం, వెంటాడటం (స్టాకింగ్), యాచకత్వం, సైబర్ వేధింపులు, సైబర్ మోసాలు తదితర అంశాలపై అవగాహన కల్పించారు. అలాగే మహిళల హెల్ప్‌లైన్ 181, బాలల హెల్ప్‌లైన్ 1098, డయల్ 100 ప్రాముఖ్యత, సైబర్ నేరాల హెల్ప్‌లైన్ 1930 తదితర అంశాల గురించి వివరించారు.