BREAKING
ప్రోస్టేట్ క్యాన్సర్ కణతులను కరిగించే సరికొత్త ఔషధం: జాన్సన్ అండ్ జాన్సన్ 'JNJ-6143' ట్రయల్స్‌లో కీలక పురోగతి.. సౌదీ అరేబియాలో చిక్కుకున్న భారతీయ ఉమ్రా యాత్రికులకు కేంద్రం అండ: సంచాలన స్కూల్ ఆఫ్ డాన్స్ ఆధ్వర్యంలో మాస్టర్స్ ఎగ్జామినేషన్ కార్తీక్ సుబ్బరాజ్ 'డోరతీ' అరుదైన చిత్రం.. ట్రాన్స్‌జెండర్ల జీవితాలకు హ్యాపీ ఎండింగ్ ఇచ్చిన డైరెక్టర్! ట్యాంకర్ల ద్వారా నీటి వృథాను అరికట్టేందుకు కఠిన చర్యలు : నవంబర్ 1 నుంచి నిబంధనల ఉల్లంఘనకు రూ.5 వేల జరిమానా నటనకు బ్రేక్ ఇవ్వడంపై ఎలాంటి రిగ్రెట్ లేదు.. అమృత పూరి ఆసక్తికర వ్యాఖ్యలు! చారిత్రక కట్టడాల పరిరక్షణ, అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి చార్మినార్ పరిసరాల్లో క్యూ క్యు ఎస్ యు డి ఎ అడ్మినిస్ట్రేటర్ పి. గౌతమి ఐఏఎస్ తనిఖీ నీటిని పొదుపుగా వాడాలి : నీటి సంరక్షణకు ‘మేము సైతం’ అంటూ ప్రతిజ్ఞ. సూమో డిడి మూవీ రివ్యూ.. భారత్ తొలి మహిళా సూమో రెజ్లర్ జీవితాధారంగా వచ్చిన సినిమా ఎలా ఉందంటే! శ్రీకృష్ణ సదర్ సమ్మేళనం–2026 . 40 ఏళ్లలో తొలిసారి.. థియేటర్‌లో అభిమానులతో కలిసి రజినీకాంత్ 'జైలర్ 2' వీక్షణం! బాక్సాఫీస్ వద్ద రజినీకాంత్ 'జైలర్ 2' సంచలనం.. రెండో వారంలోనూ తగ్గేదేలే అంటూ రూ. 369 కోట్ల వసూళ్లు! జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్‌–ఎన్‌ఎఫ్‌సీఎల్‌ జంక్షన్‌ వరకు సిగ్నల్‌ రహిత ట్రాఫిక్‌ బాక్సాఫీస్ వద్ద ఆయుష్మాన్ ఖురానా, సారా అలీ ఖాన్ 'ఉడ్తా తీర్' హవా.. రెండు రోజుల్లోనే రూ. 11 కోట్ల వసూళ్లు! లోధా అపార్ట్మెంట్స్ లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదు

మాదాపూర్‌ సున్నం చెరువులో అక్రమ నీటి దందాపై హైడ్రా ఉక్కుపాదం....అక్రమ బోర్లను ద్వంసం చేసిన హైడ్రా

Select Suryaa Now
మాదాపూర్‌  సున్నం చెరువులో అక్రమ నీటి దందాపై హైడ్రా ఉక్కుపాదం....అక్రమ బోర్లను ద్వంసం చేసిన హైడ్రా

మాదాపూర్,మేజర్ న్యూస్ : నగరంలో అక్రమ నీటి వ్యాపారానికి అడ్డుకట్ట వేసేందుకు హైడ్రా అధికారులు చర్యలు చేపట్టారు. మాదాపూర్‌లోని సున్నం చెరువు పరిసరాల్లో అక్రమంగా బోర్లు వేసి, పైప్‌లైన్ల ద్వారా నీటిని ట్యాంకర్లతో సరఫరా చేస్తున్నట్లు గుర్తించి వాటిని తొలగించారు. శనివారం ఉదయం చేపట్టిన ఈ చర్యల్లో జేసీబీల సాయంతో భూగర్భంలో ఏర్పాటు చేసిన పైప్‌లైన్‌ నెట్‌వర్క్‌ను ధ్వంసం చేశారు.

చెరువు పరిసర బస్తీల్లో కొందరు అక్రమంగా లోతైన బోర్లు వేసి భూగర్భ జలాలను తోడుతున్నట్లు అధికారులు గుర్తించారు. అక్కడి నుంచి భారీ పైప్‌లైన్ల ద్వారా నీటిని తరలిస్తూ, రోజూ పెద్ద సంఖ్యలో ట్యాంకర్లతో నగరంలోని వివిధ ప్రాంతాలకు సరఫరా చేస్తున్నట్లు విచారణలో వెల్లడైనట్లు సమాచారం.

చెరువు పరిసరాల్లోని నీటిలో రసాయనాలు, భారీ లోహాలు ఉండే ప్రమాదం ఉందని, శుద్ధి చేయకుండానే విక్రయిస్తుండటంతో ప్రజారోగ్యానికి ముప్పు పొంచి ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేసినట్లు కథనం పేర్కొంది. ఈ నేపథ్యంలో అక్రమ బోర్ల తొలగింపుతో పాటు పైప్‌లైన్‌ వ్యవస్థను ధ్వంసం చేశారు.అక్రమ నీటి వ్యాపారాన్ని అరికట్టేందుకు పరిసర ప్రాంతాల్లో నిఘా పెంచినట్లు అధికారులు తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.