BREAKING
ప్రోస్టేట్ క్యాన్సర్ కణతులను కరిగించే సరికొత్త ఔషధం: జాన్సన్ అండ్ జాన్సన్ 'JNJ-6143' ట్రయల్స్‌లో కీలక పురోగతి.. సౌదీ అరేబియాలో చిక్కుకున్న భారతీయ ఉమ్రా యాత్రికులకు కేంద్రం అండ: సంచాలన స్కూల్ ఆఫ్ డాన్స్ ఆధ్వర్యంలో మాస్టర్స్ ఎగ్జామినేషన్ కార్తీక్ సుబ్బరాజ్ 'డోరతీ' అరుదైన చిత్రం.. ట్రాన్స్‌జెండర్ల జీవితాలకు హ్యాపీ ఎండింగ్ ఇచ్చిన డైరెక్టర్! ట్యాంకర్ల ద్వారా నీటి వృథాను అరికట్టేందుకు కఠిన చర్యలు : నవంబర్ 1 నుంచి నిబంధనల ఉల్లంఘనకు రూ.5 వేల జరిమానా నటనకు బ్రేక్ ఇవ్వడంపై ఎలాంటి రిగ్రెట్ లేదు.. అమృత పూరి ఆసక్తికర వ్యాఖ్యలు! చారిత్రక కట్టడాల పరిరక్షణ, అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి చార్మినార్ పరిసరాల్లో క్యూ క్యు ఎస్ యు డి ఎ అడ్మినిస్ట్రేటర్ పి. గౌతమి ఐఏఎస్ తనిఖీ నీటిని పొదుపుగా వాడాలి : నీటి సంరక్షణకు ‘మేము సైతం’ అంటూ ప్రతిజ్ఞ. సూమో డిడి మూవీ రివ్యూ.. భారత్ తొలి మహిళా సూమో రెజ్లర్ జీవితాధారంగా వచ్చిన సినిమా ఎలా ఉందంటే! శ్రీకృష్ణ సదర్ సమ్మేళనం–2026 . 40 ఏళ్లలో తొలిసారి.. థియేటర్‌లో అభిమానులతో కలిసి రజినీకాంత్ 'జైలర్ 2' వీక్షణం! బాక్సాఫీస్ వద్ద రజినీకాంత్ 'జైలర్ 2' సంచలనం.. రెండో వారంలోనూ తగ్గేదేలే అంటూ రూ. 369 కోట్ల వసూళ్లు! జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్‌–ఎన్‌ఎఫ్‌సీఎల్‌ జంక్షన్‌ వరకు సిగ్నల్‌ రహిత ట్రాఫిక్‌ బాక్సాఫీస్ వద్ద ఆయుష్మాన్ ఖురానా, సారా అలీ ఖాన్ 'ఉడ్తా తీర్' హవా.. రెండు రోజుల్లోనే రూ. 11 కోట్ల వసూళ్లు! లోధా అపార్ట్మెంట్స్ లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదు

ఐక్యరాజ్యసమితి ప్రాధాన్యతను తెలుసుకోవాలి: డాక్టర్ వెంకటరమణ

Select Suryaa Now
 ఐక్యరాజ్యసమితి ప్రాధాన్యతను తెలుసుకోవాలి: డాక్టర్ వెంకటరమణ

                             ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు  ఐక్యరాజ్యసమితి దినోత్సవ అవగాహన
గచ్చిబౌలి,మేజర్ న్యూస్ :  ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడి బోయిన రామస్వామి యాదవ్ ఆధ్వర్యంలో మసీదు బండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో   నిర్వహించిన ఐక్యరాజ్యసమితి దినోత్సవం అవగాహన కార్యక్రమానికి స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయిని  రజని అధ్యక్షత అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన చంచల్‌గూడ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విశ్రాంత ప్రిన్సిపాల్ డాక్టర్ పూలపల్లి వెంకటరమణ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రపంచ శాంతి, భద్రత, ఆర్థిక, సామాజిక అభివృద్ధి, మానవ హక్కుల పరిరక్షణ లక్ష్యంగా ఐక్యరాజ్యసమితి ఏర్పాటైందన్నారు. 1945 అక్టోబర్ 24న 51 దేశాలతో ప్రారంభమైన ఈ సంస్థలో ప్రస్తుతం 193 సభ్యదేశాలు ఉన్నాయని, ప్రధాన కార్యాలయం న్యూయార్క్ నగరంలో ఉందని తెలిపారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారతదేశానికి శాశ్వత సభ్యత్వం లభిస్తే అంతర్జాతీయంగా మన దేశ ప్రభావం మరింత పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుడు డాక్టర్ అంబేద్కర్, విద్యార్థులు మరియు ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు అమ్మయ్య చౌదరి, శివరామకృష్ణ, వాణి సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.