BREAKING
నటనకు బ్రేక్ ఇవ్వడంపై ఎలాంటి రిగ్రెట్ లేదు.. అమృత పూరి ఆసక్తికర వ్యాఖ్యలు! చారిత్రక కట్టడాల పరిరక్షణ, అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి చార్మినార్ పరిసరాల్లో క్యూ క్యు ఎస్ యు డి ఎ అడ్మినిస్ట్రేటర్ పి. గౌతమి ఐఏఎస్ తనిఖీ నీటిని పొదుపుగా వాడాలి : నీటి సంరక్షణకు ‘మేము సైతం’ అంటూ ప్రతిజ్ఞ. సూమో డిడి మూవీ రివ్యూ.. భారత్ తొలి మహిళా సూమో రెజ్లర్ జీవితాధారంగా వచ్చిన సినిమా ఎలా ఉందంటే! శ్రీకృష్ణ సదర్ సమ్మేళనం–2026 . 40 ఏళ్లలో తొలిసారి.. థియేటర్‌లో అభిమానులతో కలిసి రజినీకాంత్ 'జైలర్ 2' వీక్షణం! బాక్సాఫీస్ వద్ద రజినీకాంత్ 'జైలర్ 2' సంచలనం.. రెండో వారంలోనూ తగ్గేదేలే అంటూ రూ. 369 కోట్ల వసూళ్లు! జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్‌–ఎన్‌ఎఫ్‌సీఎల్‌ జంక్షన్‌ వరకు సిగ్నల్‌ రహిత ట్రాఫిక్‌ బాక్సాఫీస్ వద్ద ఆయుష్మాన్ ఖురానా, సారా అలీ ఖాన్ 'ఉడ్తా తీర్' హవా.. రెండు రోజుల్లోనే రూ. 11 కోట్ల వసూళ్లు! లోధా అపార్ట్మెంట్స్ లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదు నూతన జిల్లా కార్యవర్గ సభ్యులను అభినందించిన మర్రి శశిధర్ రెడ్డి ఫ్రిజ్ లేకుండానే కూరగాయలు తాజాగా ఉండేలా చిట్కాలు.. ఈ చిన్న ట్రిక్స్ పాటిస్తే సరి! సైబరాబాద్ సీపీ హోంగార్డ్స్ సంఘం అధ్యక్షులుగా బొక్క గోపాల్ షీ టీమ్స్ ఆపరేషన్లలో 28 మంది అరెస్ట్ - సైబరాబాద్ డీసీపీ మహిళలు, బాలల భద్రతా విభాగం ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం: ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు

హరీష్ రావును మర్యాదపూర్వకంగా కలిసిన బీఆర్ఎస్ నేతలు

Select Suryaa Now
హరీష్ రావును మర్యాదపూర్వకంగా కలిసిన బీఆర్ఎస్ నేతలు

అమీన్‌పూర్ ; విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకొని మాజీ మంత్రివర్యులు, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావును ఆయన నివాసంలో బీఆర్ఎస్ ముఖ్య నేతలు మర్యాదపూర్వకంగా కలిశారు. పండుగ అనంతరం ఈరోజు ఉదయం అమీన్‌పూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి ఆయనను కలిసి పుష్పగుచ్ఛం అందజేసి దసరా శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా నియోజకవర్గ పరిధిలోని తాజా రాజకీయ పరిస్థితులు, స్థానిక అభివృద్ధి పనులు, ప్రజా సమస్యలపై కొద్దిసేపు చర్చించారు. నిరంతరం ప్రజల్లో ఉంటూ, పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసే హరీష్ రావు నాయకత్వం అందరికీ ఆదర్శప్రాయమని నేతలు పేర్కొన్నారు.ఈ భేటీ అనంతరం అమీన్‌పూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ అభివృద్ధిలో, ప్రజా సమస్యల పరిష్కారంలో హరీష్ రావు గారి పాత్ర ఎనలేనిదని, కార్యకర్తలకు నిరంతరం అండగా నిలిచే గొప్ప నాయకుడని కొనియాడారు. గూడెం మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసి, ప్రజా సమస్యలపై పోరాడేందుకు హరీష్ రావు గారి సూచనలు, సలహాలు అమూల్యమైనవని తెలిపారు.

ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ అంతిరెడ్డి, పలువురు బీఆర్ఎస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.