BREAKING
ప్రోస్టేట్ క్యాన్సర్ కణతులను కరిగించే సరికొత్త ఔషధం: జాన్సన్ అండ్ జాన్సన్ 'JNJ-6143' ట్రయల్స్‌లో కీలక పురోగతి.. సౌదీ అరేబియాలో చిక్కుకున్న భారతీయ ఉమ్రా యాత్రికులకు కేంద్రం అండ: సంచాలన స్కూల్ ఆఫ్ డాన్స్ ఆధ్వర్యంలో మాస్టర్స్ ఎగ్జామినేషన్ కార్తీక్ సుబ్బరాజ్ 'డోరతీ' అరుదైన చిత్రం.. ట్రాన్స్‌జెండర్ల జీవితాలకు హ్యాపీ ఎండింగ్ ఇచ్చిన డైరెక్టర్! ట్యాంకర్ల ద్వారా నీటి వృథాను అరికట్టేందుకు కఠిన చర్యలు : నవంబర్ 1 నుంచి నిబంధనల ఉల్లంఘనకు రూ.5 వేల జరిమానా నటనకు బ్రేక్ ఇవ్వడంపై ఎలాంటి రిగ్రెట్ లేదు.. అమృత పూరి ఆసక్తికర వ్యాఖ్యలు! చారిత్రక కట్టడాల పరిరక్షణ, అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి చార్మినార్ పరిసరాల్లో క్యూ క్యు ఎస్ యు డి ఎ అడ్మినిస్ట్రేటర్ పి. గౌతమి ఐఏఎస్ తనిఖీ నీటిని పొదుపుగా వాడాలి : నీటి సంరక్షణకు ‘మేము సైతం’ అంటూ ప్రతిజ్ఞ. సూమో డిడి మూవీ రివ్యూ.. భారత్ తొలి మహిళా సూమో రెజ్లర్ జీవితాధారంగా వచ్చిన సినిమా ఎలా ఉందంటే! శ్రీకృష్ణ సదర్ సమ్మేళనం–2026 . 40 ఏళ్లలో తొలిసారి.. థియేటర్‌లో అభిమానులతో కలిసి రజినీకాంత్ 'జైలర్ 2' వీక్షణం! బాక్సాఫీస్ వద్ద రజినీకాంత్ 'జైలర్ 2' సంచలనం.. రెండో వారంలోనూ తగ్గేదేలే అంటూ రూ. 369 కోట్ల వసూళ్లు! జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్‌–ఎన్‌ఎఫ్‌సీఎల్‌ జంక్షన్‌ వరకు సిగ్నల్‌ రహిత ట్రాఫిక్‌ బాక్సాఫీస్ వద్ద ఆయుష్మాన్ ఖురానా, సారా అలీ ఖాన్ 'ఉడ్తా తీర్' హవా.. రెండు రోజుల్లోనే రూ. 11 కోట్ల వసూళ్లు! లోధా అపార్ట్మెంట్స్ లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదు

భూ రికార్డులపై రైతులకు అవగాహన అవసరం : తహసీల్దార్‌ చంద్రశేఖర్‌

Select Suryaa Now
భూ రికార్డులపై రైతులకు అవగాహన అవసరం : తహసీల్దార్‌ చంద్రశేఖర్‌

ఘట్‌కేసర్‌ రూరల్, మేజర్ న్యూస్: భూ సమస్యల పరిష్కారంతో పాటు భూముల రికార్డుల్లో పారదర్శకత, కచ్చితత్వం కోసం రైతులు, భూ యజమానులు భూభారతి, భూసర్వే విధానాలపై అవగాహన పెంపొందించుకోవాలని ఘట్‌కేసర్‌ మండల తహసీల్దార్‌ చంద్రశేఖర్‌ సూచించారు. మండల రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో శనివారం యంనంపేట్‌ రెవెన్యూ గ్రామంలో నిర్వహించిన భూభారతి–భూసర్వే అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. గ్రామంలోని భూముల సమగ్ర సర్వే, డిజిటల్‌ మ్యాపింగ్‌, భూదార్‌ కార్డుల జారీకి సంబంధించిన అంశాలను ఈ సందర్భంగా వివరించారు. భూ రికార్డులు, సర్వే ప్రక్రియపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ, భూములకు సంబంధించిన వివరాలపై సందేహాలను నివృత్తి చేసుకునేందుకు ఇటువంటి సదస్సులు ఉపయోగపడతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్‌ చంద్రశేఖర్‌, ఆర్‌ఐ సాయిరాం, మండల సర్వేయర్‌, ఇతర రెవెన్యూ అధికారులు, పోచారం డివిజన్‌ కాంగ్రెస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మెట్టు గణేష్‌ యాదవ్‌, యంనంపేట్‌ మాజీ సర్పంచ్‌ పతేప్పు రాములు, గ్రామ శాఖ అధ్యక్షుడు సహదేవ్‌ గౌడ్‌, సగ్గు శ్రీనివాస్‌, పొలాగోని ప్రభాకర్‌ గౌడ్‌, రేగు సత్యనారాయణ, పతేప్పు పోశెట్టి, పొలాగోని కృష్ణ గౌడ్‌, నలరాళ్ల కొండల్‌ రెడ్డి, సగ్గు జగన్మోహన్‌, బీజేపీ నాయకుడు పతేప్పు పాండు, గ్రామ పెద్దలు, ప్రజలు పాల్గొన్నారు.

రిపోర్టర్: రాజు, ఘట్కేసర్ రూరల్, మేడ్చల్ జిల్లా.