BREAKING
ప్రోస్టేట్ క్యాన్సర్ కణతులను కరిగించే సరికొత్త ఔషధం: జాన్సన్ అండ్ జాన్సన్ 'JNJ-6143' ట్రయల్స్‌లో కీలక పురోగతి.. సౌదీ అరేబియాలో చిక్కుకున్న భారతీయ ఉమ్రా యాత్రికులకు కేంద్రం అండ: సంచాలన స్కూల్ ఆఫ్ డాన్స్ ఆధ్వర్యంలో మాస్టర్స్ ఎగ్జామినేషన్ కార్తీక్ సుబ్బరాజ్ 'డోరతీ' అరుదైన చిత్రం.. ట్రాన్స్‌జెండర్ల జీవితాలకు హ్యాపీ ఎండింగ్ ఇచ్చిన డైరెక్టర్! ట్యాంకర్ల ద్వారా నీటి వృథాను అరికట్టేందుకు కఠిన చర్యలు : నవంబర్ 1 నుంచి నిబంధనల ఉల్లంఘనకు రూ.5 వేల జరిమానా నటనకు బ్రేక్ ఇవ్వడంపై ఎలాంటి రిగ్రెట్ లేదు.. అమృత పూరి ఆసక్తికర వ్యాఖ్యలు! చారిత్రక కట్టడాల పరిరక్షణ, అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి చార్మినార్ పరిసరాల్లో క్యూ క్యు ఎస్ యు డి ఎ అడ్మినిస్ట్రేటర్ పి. గౌతమి ఐఏఎస్ తనిఖీ నీటిని పొదుపుగా వాడాలి : నీటి సంరక్షణకు ‘మేము సైతం’ అంటూ ప్రతిజ్ఞ. సూమో డిడి మూవీ రివ్యూ.. భారత్ తొలి మహిళా సూమో రెజ్లర్ జీవితాధారంగా వచ్చిన సినిమా ఎలా ఉందంటే! శ్రీకృష్ణ సదర్ సమ్మేళనం–2026 . 40 ఏళ్లలో తొలిసారి.. థియేటర్‌లో అభిమానులతో కలిసి రజినీకాంత్ 'జైలర్ 2' వీక్షణం! బాక్సాఫీస్ వద్ద రజినీకాంత్ 'జైలర్ 2' సంచలనం.. రెండో వారంలోనూ తగ్గేదేలే అంటూ రూ. 369 కోట్ల వసూళ్లు! జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్‌–ఎన్‌ఎఫ్‌సీఎల్‌ జంక్షన్‌ వరకు సిగ్నల్‌ రహిత ట్రాఫిక్‌ బాక్సాఫీస్ వద్ద ఆయుష్మాన్ ఖురానా, సారా అలీ ఖాన్ 'ఉడ్తా తీర్' హవా.. రెండు రోజుల్లోనే రూ. 11 కోట్ల వసూళ్లు! లోధా అపార్ట్మెంట్స్ లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదు

సోమాజిగూడ హెడ్ క్వార్టర్స్ బార్‌లో రివాల్వర్‌తో హల్‌చల్‌.. కస్టమర్లు, బౌన్సర్లకు బెదిరింపులు

Select Suryaa Now
సోమాజిగూడ హెడ్ క్వార్టర్స్      బార్‌లో రివాల్వర్‌తో హల్‌చల్‌.. కస్టమర్లు, బౌన్సర్లకు బెదిరింపులు

                                  బిల్లు డబ్బులు తిరిగి ఇవ్వాలని తుపాకీతో బెదిరించిన వ్యక్తి.. పోలీసుల అదుపులో నిందితుడు

సోమాజిగూడ /మేజర్ న్యూస్ : సోమాజిగూడలోని హెడ్ క్వార్టర్స్ బార్ అండ్ రెస్టారెంట్‌లో రివాల్వర్‌తో హల్‌చల్‌ చేసి, కస్టమర్లు, బౌన్సర్లను బెదిరించిన ఘటన కలకలం రేపింది. బిల్లు రూపంలో చెల్లించిన డబ్బులను తిరిగి ఇవ్వాలని తుపాకీ చూపిస్తూ బెదిరింపులకు పాల్పడినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ ఘటనకు సంబంధించి మహమ్మద్ షానవాజ్ (24) అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఫిర్యాదులోని వివరాల ప్రకారం.. అక్టోబర్ 24వ తేదీ అర్ధరాత్రి సుమారు 12.30 గంటల సమయంలో బార్ అండ్ రెస్టారెంట్ రెండో అంతస్తులో కస్టమర్ల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారకుండా బార్ సిబ్బంది జోక్యం చేసుకుని ఇరువర్గాలను బయటకు పంపించారు.

అనంతరం వారిలో ఒక వ్యక్తి సెల్లార్‌లో పార్క్ చేసిన మహీంద్రా థార్ వాహనం వద్దకు వెళ్లి, అందులో నుంచి రివాల్వర్ తీసుకుని తిరిగి రెస్టారెంట్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ క్రమంలో గ్రౌండ్ ఫ్లోర్ వద్ద ఉన్న బౌన్సర్ గణేశ్ అతడిని అడ్డుకుని, అక్కడి నుంచి సెల్లార్ ప్రాంతానికి తరలించినట్లు తెలిపారు.

అయితే, రాత్రి సుమారు 12.40 గంటల సమయంలో సదరు వ్యక్తి సెల్లార్‌లో ఉన్న ఇతర కస్టమర్లు, సిబ్బందిని రివాల్వర్‌తో బెదిరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. బిల్లు కోసం చెల్లించిన డబ్బులు తిరిగి ఇవ్వకపోతే కాల్చి చంపుతానని హెచ్చరించడంతో అక్కడున్న వారిలో భయాందోళనలు నెలకొన్నాయని ఫిర్యాదుదారుడు తెలిపారు. ప్రాణభయంతో కస్టమర్లు, సిబ్బంది కేకలు వేస్తూ అక్కడి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించినట్లు పేర్కొన్నారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మహమ్మద్ షానవాజ్‌ను అదుపులోకి తీసుకున్నట్లు ఫిర్యాదులో వివరించారు. అతడి వద్ద నుంచి రివాల్వర్‌ను స్వాధీనం చేసుకుని, అతడిని థార్ వాహనంతో సహా పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లినట్లు తెలిపారు.

ఈ ఘటనలో రివాల్వర్‌ను వాహనం నుంచి తీసుకొచ్చి బార్ ప్రాంగణంలో చూపిస్తూ బెదిరింపులకు పాల్పడినట్లు వచ్చిన ఆరోపణలపై సంబంధిత వ్యక్తిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని బార్ అండ్ రెస్టారెంట్ బౌన్సర్ బచ్చు బంటీ పోలీసుల కు ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుండిని రిమాండ్ కు తరలించారు.