BREAKING
ప్రోస్టేట్ క్యాన్సర్ కణతులను కరిగించే సరికొత్త ఔషధం: జాన్సన్ అండ్ జాన్సన్ 'JNJ-6143' ట్రయల్స్‌లో కీలక పురోగతి.. సౌదీ అరేబియాలో చిక్కుకున్న భారతీయ ఉమ్రా యాత్రికులకు కేంద్రం అండ: సంచాలన స్కూల్ ఆఫ్ డాన్స్ ఆధ్వర్యంలో మాస్టర్స్ ఎగ్జామినేషన్ కార్తీక్ సుబ్బరాజ్ 'డోరతీ' అరుదైన చిత్రం.. ట్రాన్స్‌జెండర్ల జీవితాలకు హ్యాపీ ఎండింగ్ ఇచ్చిన డైరెక్టర్! ట్యాంకర్ల ద్వారా నీటి వృథాను అరికట్టేందుకు కఠిన చర్యలు : నవంబర్ 1 నుంచి నిబంధనల ఉల్లంఘనకు రూ.5 వేల జరిమానా నటనకు బ్రేక్ ఇవ్వడంపై ఎలాంటి రిగ్రెట్ లేదు.. అమృత పూరి ఆసక్తికర వ్యాఖ్యలు! చారిత్రక కట్టడాల పరిరక్షణ, అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి చార్మినార్ పరిసరాల్లో క్యూ క్యు ఎస్ యు డి ఎ అడ్మినిస్ట్రేటర్ పి. గౌతమి ఐఏఎస్ తనిఖీ నీటిని పొదుపుగా వాడాలి : నీటి సంరక్షణకు ‘మేము సైతం’ అంటూ ప్రతిజ్ఞ. సూమో డిడి మూవీ రివ్యూ.. భారత్ తొలి మహిళా సూమో రెజ్లర్ జీవితాధారంగా వచ్చిన సినిమా ఎలా ఉందంటే! శ్రీకృష్ణ సదర్ సమ్మేళనం–2026 . 40 ఏళ్లలో తొలిసారి.. థియేటర్‌లో అభిమానులతో కలిసి రజినీకాంత్ 'జైలర్ 2' వీక్షణం! బాక్సాఫీస్ వద్ద రజినీకాంత్ 'జైలర్ 2' సంచలనం.. రెండో వారంలోనూ తగ్గేదేలే అంటూ రూ. 369 కోట్ల వసూళ్లు! జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్‌–ఎన్‌ఎఫ్‌సీఎల్‌ జంక్షన్‌ వరకు సిగ్నల్‌ రహిత ట్రాఫిక్‌ బాక్సాఫీస్ వద్ద ఆయుష్మాన్ ఖురానా, సారా అలీ ఖాన్ 'ఉడ్తా తీర్' హవా.. రెండు రోజుల్లోనే రూ. 11 కోట్ల వసూళ్లు! లోధా అపార్ట్మెంట్స్ లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదు

జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కల సాకారం చేస్తాం రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

Select Suryaa Now
జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కల సాకారం చేస్తాం  రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో గత కొన్ని సంవత్సరాలుగా ఇళ్ల స్థలాల కోసం ఎదురుచూస్తున్న జర్నలిస్టుల ఆకాంక్షలను తమ ప్రభుత్వం నెరవేరుస్తుందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. జర్నలిస్టులకు చట్టపరమైన చిక్కులు లేని విధంగా, నివాసయోగ్యమైన ప్రాంతంలో ఇళ్ల స్థలాలు అందించేందుకు ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తోందని శ‌నివారం విడుద‌ల చేసిన ఒక ప్ర‌క‌ట‌న‌లో వెల్లడించారు.

దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2008 లో జర్నలిస్టు హౌసింగ్ సొసైటీకి  భూములు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయని మంత్రి గుర్తుచేశారు. అయితే, ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టులో కేసు పెండింగ్‌లో ఉండటంతో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు అందించే ప్రక్రియ సుదీర్ఘకాలం నిలిచిపోయిందని తెలిపారు. 2022లో న్యాయపరమైన అడ్డంకులు తొలగిన తర్వాత కూడా గతంలో ఈ సమస్యకు పూర్తిస్థాయి పరిష్కారం లభించలేదని పేర్కొన్నారు.

  గౌర‌వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల్లోనే జర్నలిస్టుల ఇళ్ల స్థలాల అంశంపై చొరవ తీసుకుంది. దాదాపు రెండు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీకి 2024 సెప్టెంబర్ 8వ తేదీన రవీంద్ర భారతిలో  కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించి భూమిని సొసైటీకి అప్పగించడం జ‌రిగింద‌న్నారు.  అనంతరం సుప్రీంకోర్టు తుది ఉత్త‌ర్వుల  నేపథ్యంలో మరోసారి న్యాయపరమైన సమస్యలు ఎదురుకావడంతో ఈ అంశానికి శాశ్వత పరిష్కారం చూపాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. ఈ పరిస్థితుల్లో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు సహచర మంత్రులతో పలుమార్లు చర్చించి  జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు అందించే అంశంపై సమగ్రంగా సమీక్షించినట్లు మంత్రిగారు వెల్లడించారు.

జర్నలిస్టుల సొంతింటి కలను సాకారం చేయాలన్నది మా ప్రభుత్వ సంకల్పం. గతంలో ఎదురైన న్యాయపరమైన సమస్యలు పునరావృతం కాకుండా, చట్టపరమైన చిక్కులు లేని విధంగా, కుటుంబాలతో గౌరవంగా నివసించేందుకు అనువైన  ప్రాంతంలో ఇళ్ల స్థలాలు అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం. జర్నలిస్టులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వారి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోంద‌ని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి భరోసా ఇచ్చారు. ఇప్ప‌టివ‌ర‌కు కూడా కాంగ్రెస్ ప్ర‌భుత్వ హ‌యాంలోనే జ‌ర్న‌లిస్టుల‌కు ఇళ్ల‌స్ధ‌లాలు ఇవ్వ‌డం జ‌రిగిందని మ‌రోసారి కాంగ్రెస్ పాల‌న‌లోనే ఇస్తామ‌ని స్ప‌ష్టం చేశారు.

ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ ప్రజాస్వామ్య వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న జర్నలిస్టుల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి పేర్కొన్నారు. జర్నలిస్టుల దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించడంతోపాటు, వారికి గౌరవప్రదమైన జీవనానికి అవసరమైన వసతులు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. జర్నలిస్టుల సొంతింటి కల నెరవేరేలా, అందరికీ ఆమోదయోగ్యమైన శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రి తెలిపారు.