గౌరవప్రదంగా జీవించాలి ---జిల్లా అదనపు కలెక్టర్ నగేష్
మెదక్ ; గుడిసెల్లో నివసించే ప్రజలు ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకొని గౌరవ ప్రదంగా జీవించాలని జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ నూతనంగా ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకోబోయే లబ్దిదారులకు సూచించారు.శనివారం శంకరం పేట ఆర్ మండలంలోని కొర్విపల్లి తండా లో నూతనంగా ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారుల తో మాట్లాడారు.ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ మాట్లాడుతూ.. గుడిసెలు లేకుండా గౌరవంగా జీవించాలని, ఇల్లు నిర్మించే సమయంలో అధికారుల సూచనాలు పాటించి అతి తక్కువ ఖర్చు తో ఇండ్ల నిర్మాణాలకు చేపట్టాలన్నారు.త్వరలోనే శాసన సభ్యులు మైనంపల్లి రోహిత్ రావు చేతుల మీదుగా ఇండ్ల మంజూరు పత్రాలు అందించడం జరుగుతుందన్నారు..ఈ కార్యక్రమంలో హౌసింగ్ పీడీ మాణిక్యం, ఎంపీడీవో దామోదర్,హౌసింగ్ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.