BREAKING
ఖండవల్లిలో కూటమి జడ్పీటీసీ అభ్యర్థి ఇంటింటా ఎన్నికల ప్రచారం రూ.195 కోట్లతో నిడదవోలు పట్టణాభివృద్ధి:మంత్రి కందుల దుర్గేష్ ఎస్ జి ఎఫ్ రాష్ట్ర స్థాయి హాకీ పోటీలకు పందలపాక విద్యార్థులు ఎంపిక జనసేన పార్టీ నుండి వైయస్సార్ పార్టీలో చేరికలు నేటి పంచాంగం 26 అక్టోబర్ 2026 నేటి రాశి ఫలాలు –26 అక్టోబర్ 2026 అంబాజీపేటలో శ్రీ విజయ భేతాళస్వామి వాహన మహోత్సవం.. గుగులోతు రామస్వామి నాయక్ కు ఘన సన్మానం అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకోవాలి-డిసిసి ప్రధాన కార్యదర్శి శ్రీపాల్ రెడ్డి ప్రమాదవశాత్తు నిప్పంటుకొని వృద్ధురాలికి తీవ్ర గాయాలు గంజాయి రవాణా చేస్తున్న మహారాష్ట్ర పోలీస్ కానిస్టేబుల్-ఆరు లక్షల విలువైన 12 కిలోల గంజాయి పట్టివేత సాయినగర్ కాలనీలో ఎమ్మెల్సీ పట్టభద్రుల ఓటరు నమోదు ఎన్‌టీఆర్‌ నగర్‌లో కిడ్నాప్‌ కలకలం.... గంటల్లోనే కిడ్నాప్‌నకు గురైన వ్యక్తిని గుర్తించిన గచ్చిబౌలి పోలీసులు . జీహెచ్‌ఎంసీ మహిళా కార్మికులకు చీరల పంపిణీ చేసిన బలరాం యాదవ్ పట్టభద్రులు ఓటర్లుగా నమోదు కావాలి: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు

ఎన్ఎండీసీ టీపీజీఎల్ సీజన్‌-6 గోల్ఫ్ టోర్నీ ప్రారంభం టీ-ఆఫ్ చేసి ప్రారంభించిన డీజీపీ సీవీ ఆనంద్‌

Select Suryaa Now
ఎన్ఎండీసీ టీపీజీఎల్ సీజన్‌-6 గోల్ఫ్ టోర్నీ ప్రారంభం  టీ-ఆఫ్ చేసి ప్రారంభించిన డీజీపీ సీవీ ఆనంద్‌

హైదరాబాద్, మేజర్ న్యూస్ ప్రతినిధి : హైదరాబాద్ గోల్ఫ్ అసోసియేషన్‌ (హెచ్‌జీఏ) వేదికగా ఎన్ఎండీసీ టీపీజీఎల్ సీజన్‌-6 గోల్ఫ్ టోర్నమెంట్‌ లీగ్‌ మ్యాచ్‌లు ప్రారంభమయ్యాయి. తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్‌ ఐపీఎస్‌ లాంఛనంగా టీ-ఆఫ్‌ చేసి టోర్నీని ప్రారంభించారు. ఈ సీజన్‌లో 16 జట్లకు చెందిన 192 మంది క్రీడాకారులు పోటీపడుతున్నారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ, వివిధ స్థాయుల క్రీడాకారులు పోటీపడేందుకు అవకాశం కల్పించే ఈ టోర్నమెంట్‌ విధానం అభినందనీయమన్నారు. క్రీడాకారులందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
హెచ్‌జీఏ అధ్యక్షుడు భాస్కర్‌ ఎ. రెడ్డి మాట్లాడుతూ, క్రీడాకారులు క్రీడాస్ఫూర్తితో పోటీపడుతూ గోల్ఫ్‌ ఆటను ఆస్వాదించాలని కోరారు. ఐదు క్వాలిఫైయింగ్‌ రౌండ్లలో ఐదు విభిన్న ఫార్మాట్లలో పోటీలు నిర్వహించనున్నట్లు టీపీజీఎల్‌ కమిషనర్‌ సంజయ్‌ కమటం వెల్లడించారు. ఈ ఫార్మాట్లు క్రీడాకారుల నైపుణ్యాలు, వ్యూహరచన, జట్టు సమన్వయాన్ని పరీక్షిస్తాయని తెలిపారు.
కార్యక్రమంలో హెచ్‌జీఏ గౌరవ కార్యదర్శి వందిత్‌ రెడ్డి, కెప్టెన్‌ జెస్సీ బిర్గి, కోర్స్‌ ఛైర్మన్‌ హేమంత్‌ రెడ్డి, టోర్నమెంట్‌ ఛైర్మన్‌ సందీప్‌ రాథీ తదితరులు పాల్గొన్నారు.