వెంగళరావు నగర్‌లో పట్టభద్రుల ఓటరు నమోదు
వెంగళరావునగర్, మేజర్ న్యూస్: జూబ్లీహిల్స్ నియోజకవర్గం వెంగళరావు నగర్ డివిజన్ పరిధిలోని మధురానగర్ డీఎన్‌ఆర్ రెసిడెన్సీలో శనివారం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమం నిర్వహించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దేవిరెడ్డి నాగార్జునరెడ్డి పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పట్టభద్రులు ఓటరుగా నమోదు చేసుకునేందుకు అవసరమైన ప్రక్రియను చేపట్టారు. కార్యక్రమంలో డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షులు పూదోట శౌరిరాజు, డీసీసీ ఉపాధ్యక్షులు సోమ పటేల్, కార్యదర్శి రేఖ, నాయకులు చిలకల వెంకటేశ్వరరావు, సి.హనుమంతరావు తదితరలు పాల్గొన్నారు.