అభివృద్ధికి ఓటేసి గెలిపించండి :మంత్రి వాసంశెట్టి సుభాష్
రామచంద్రపురం మేజర్ న్యూస్ :రామచంద్రపురం పట్టణాన్ని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆధ్వర్యంలో అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నామని టీడీపీ సీనియర్ నాయకురాలు, 22వ వార్డు టీడీపీ అభ్యర్థి జాస్తి విజయలక్ష్మి అన్నారు. పట్టణంలో మరిన్ని అభివృద్ధి పనులు, మౌలిక సదుపాయాల కల్పన కోసం కూటమి అభ్యర్థులకు మద్దతు తెలిపి గెలిపించాలని ఆమె పట్టణ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
మున్సిపాలిటీ పరిధిలోని 22వ వార్డులో ఆమె పలు ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుసుకుని, వార్డు అభివృద్ధికి తనకు మద్దతు ఇవ్వాలని అభ్యర్థించారు.
ఈ సందర్భంగా విజయలక్ష్మి మాట్లాడుతూ, గత రెండేళ్లలో మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆధ్వర్యంలో టీడీపీ ప్రభుత్వం పట్టణ అభివృద్ధికి పలు చర్యలు చేపట్టిందని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో వార్డులో మరిన్ని మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తానని తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారానికి, వార్డు అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని పేర్కొంటూ, తనను ఆదరించి గెలిపించాలని కోరారు.
ఈ ఎన్నికల ప్రచారంలో పార్టీ నాయకులు రెడ్డి సురేష్, చెలంకూరి కల్యాణ్, ముత్యాల శ్రీహరి, కొమరిన శ్రీనివాస్, పసళ్ల వీరన్న చౌదరి, పసల వీర్రాజు చౌదరి, కొప్పెల సత్యనారాయణ, అడపా సతీరాజు తదితరులు పాల్గొన్నారు.