రక్తదానం మరికొందరికి ప్రాణదానం :మానవత
గోపాలపురం మేజర్ న్యూస్ :గోపాలపురం మండల మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో స్థానిక శర్వాణి స్కూల్లో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరం విజయవంతమైంది ఈ శిబిరాన్ని జిల్లా కేంద్రా నియంత్రణ కమిటీ చైర్మన్ కండెపు సూర్యనారాయణ జిల్లా అధ్యక్షులు వాసు బోయిన చంద్రయ్య లు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాలు సమాజంలో మానవత్వ స్థాయిని పెంచుతాయని అన్నారు ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉంటూ రక్త దానం చేయడం వల్ల మరొకరికి ప్రాణదానం అవుతుందనిఅన్నారు.
అయ్యప్ప మాల ధారణతో ఉన్న తాళ్లపూడి మండలం పెద్దేవం గ్రామరెవెన్యూ అధికారి ఎర్రంకి సంతోష్ స్వామిశిబిరంలో రక్తదానం చేయడంతో అందరూ అభినందించారు. అదేవిధంగా గోపాలపురానికి చెందిన సిహెచ్వీ ఎన్ కె సత్యనారాయణ అనే అనేఅందుడు , వికలాంగుడు 20వసారి రక్తదానం చేసి అందరి అభిమానం అభినందనలు అందు కొన్నారు. ఈ శిబిరంలో సుమారు 100 మంది రక్తదానం చేయడం ద్వారా ఎందరికో ప్రాణదానం వుతుందని జిల్లా బ్లడ్ బ్యాంకు డైరెక్టర్ జోడాల వెంకట్ అన్నారు. జిల్లా సభ్యులు బాగవల్లి వెంకట సుబ్బారావు గోపాలపురం మండల మానవతా చైర్మన్ జొన్నలగడ్డ రాంబాబు అధ్యక్షులు ఎండపల్లి శేఖర్ బాబు మండల బ్లడ్ బ్యాంకు డైరెక్టర్ నెల్లి చంద్రశేఖర్ ట్రెజరర్ గడ జోగేంద్ర ప్రసాద్ సభ్యులు గడ్డం రాధాకృష్ణ ఈసీ మెంబర్ చలపతి నరేంద్ర సిఆర్పి కొయ్య నాగరాజు సర్వాణి స్కూల్ ప్రిన్సిపాల్ అశోక్ కాకర్ల సూర్యప్రకాశరావు దుర్గారావు మానేపల్లి నాగు ప్రసన్న కుమార్ తదితర మానవతా సభ్యులు పాల్గొని దాతలకు పానీయాలు సర్టిఫికెట్లు అందజేశారు.