BREAKING
చివరి రెండు రోజులు సందడిగా మారిన ‘షీ-2026’ చేనేత వస్త్ర ప్రదర్శన చేనేత చీరల కొనుగోలుకు ఆసక్తి చూపిన వస్త్రాభిమానులు ఆధ్యాత్మిక ప్రచారుకులకు ఘన సత్కారం హరీష్ రావును మర్యాదపూర్వకంగా కలిసిన బీఆర్ఎస్ నేతలు ముద్రా థెరపీతో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు.. చేతి వేళ్లతో రోగాలను నయం చేయవచ్చా! ఈ ఫ్లెక్సీ లకు ఎన్నికల కోడ్ వర్తించదా...! రూరల్ పోలీస్ స్టేషన్ కు ఎదురుగా కూటమి నేతల బ్యానర్లు వెంగళరావు నగర్‌లో పట్టభద్రుల ఓటరు నమోదు ​పరిశ్రమల ప్రమాదాలపై ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యం బాధాకరం ​ఫ్యాక్టరీస్ ఇన్‌స్పెక్టర్లు, డైరెక్టర్ల ఖాళీలను తక్షణమే భర్తీ చేయాలి తోమాల సేవలకు జనార్ధన స్వామి చిత్రపటం అందజేత నవంబర్ 21న చెక్ బౌన్స్ కేసులపై లోక్ అదాలత్ -- న్యాయమూర్తి వాసంతి పట్టభద్రుల ఓటు నమోదు కోసం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్ కివీస్‌తో మ్యాచ్‌లో చెలరేగిన తిలక్ వర్మ.. ఆరంభంలో ఆచితూచి ఆడి చివర్లో అద్భుత బ్యాటింగ్! ఎన్ఎండీసీ టీపీజీఎల్ సీజన్‌-6 గోల్ఫ్ టోర్నీ ప్రారంభం టీ-ఆఫ్ చేసి ప్రారంభించిన డీజీపీ సీవీ ఆనంద్‌ కడియం లో 115 నామినేషన్ శ్రీ భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న గరివిడి లక్ష్మి చిత్ర యూనిట్ రెండున్నరేళ్ళలో రూ. 88.46 కోట్లతో అభివృద్ధి -- దీనిని దృష్టిలో ఉంచుకుని కూటమి అభ్యర్ధులను అన్ని వర్గాలు ప్రజలు ఆశీర్వదించాలి --రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి

గంజాయి స్వాధీనం.. వ్యక్తి అరెస్టు

Select Suryaa Now
గంజాయి స్వాధీనం.. వ్యక్తి అరెస్టు
సూర్య వాంకిడి: గంజాయిని అక్రమంగా తరలిస్తున్న వ్యక్తిని వాంకిడి పోలీసులు అరెస్టు చేశారు. అతడి వద్ద నుంచి 345 గ్రాముల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. సవాతి రోడ్డులోని కుమురం భీమ్ విగ్రహం వద్ద శనివారం ఎస్‌ఐ డి. మహేందర్‌ పోలీసు సిబ్బందితో కలిసి తనిఖీలు చేపట్టారు. బండకాశ గ్రామానికి చెందిన తుంరం లింగు (42) అనుమానాస్పదంగా కనిపించడంతో అతడి వద్ద ఉన్న సంచిని తనిఖీ చేశారు. అందులో 345 గ్రాముల ఎండు గంజాయి లభించింది.
గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలను అడ్డుకునేందుకు నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నట్లు సీఐ ఎస్. వేణుగోపాల్ తెలిపారు. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు. గంజాయి లేదా ఇతర మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాల సమాచారం తెలిస్తే పోలీసులకు తెలియజేయాలని ప్రజలను కోరారు. నిందితుడిని పట్టుకోవడంలో చురుకుగా వ్యవహరించిన సిబ్బందిని సీఐ అభినందించారు.